Friday, September 12, 2025 06:35 PM
Friday, September 12, 2025 06:35 PM
roots

పవన్ సంచలన నిర్ణయం.. రెండు రాష్ట్రాల్లో జనసేన సర్వేలు

తెలంగాణాలో జనసేన పార్టీ పరిస్థితి ఏంటి అనేది ఆ పార్టీ కార్యకర్తల ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉండటంతో తెలంగాణపై కూడా పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టే అవకాశం ఉందని జనసేన పార్టీ నాయకులు ఆశలు పెట్టుకున్నారు. ఈ మధ్య కాలంలో ఎన్డియే తెలంగాణా ప్రయాణం గురించి ఎన్నో వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. రాజకీయంగా ప్రస్తుతం తెలంగాణాలో గులాబీ పార్టీ ఇబ్బంది పడుతోంది. రేవంత్ రెడ్డిని ఎదుర్కొనే విషయంలో మాజీ సీఎం కేసీఆర్ వెనుకబడుతున్నారు. కాంగ్రెస్ వ్యుహాలకి ధీటుగా సమాధానం చెప్పలేకపోతున్నారు. చేసిన తప్పులు, తప్పుడు పనులు వారిని వెంటాడుతున్నాయి.

Also Read : ఫాం హౌస్ లో జగన్ తో కేటిఆర్ భేటీ

ఇక గులాబీ పార్టీ నాయకులకు వర్కింగ్ ప్రెసిడెంట్ గా, భవిష్యత్తు నాయకుడిగా కేటిఆర్ నమ్మకం కల్పించడం లేదనే అభిప్రాయాలు సైతం వినపడుతున్నాయి. ఆయన పై వస్తున్న వరుస విమర్శలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. ఈ తరుణంలో తెలంగాణాలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సెప్టెంబర్ నుంచి పూర్తిగా పార్టీపై దృష్టి సారించనున్న పవన్.. ఆగస్ట్ లో సినిమాల షూటింగ్స్ అన్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగానే ఆయన పని చేస్తున్నారు. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసి, రాజకీయాలకే పూర్తి సమయం కేటాయించేలా ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. తెలంగాణాలో బిజెపి అవకాశాలు మెరుగుపడటంతో.. భాగస్వామ్య పార్టీగా ఉన్న జనసేన దూకుడు పెంచాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.

Also Read : జూబ్లీహిల్స్ బై పోల్.. సీన్‌లోకి కొత్త పేరు..!

ఏపీలో రాష్ట్రంలో జనసేన ఎదుర్కొంటున్న పరిస్థితులపై నివేదిక సిద్ధం చేస్తున్న నేతలు.. త్వరలోనే పవన్ కళ్యాణ్ కు ఇచ్చే అవకాశం ఉంది. కూటమిలో కొనసాగుతూనే జనసేన బలపడే దిశగా వ్యూహాలు రచిస్తున్నారు. ఇదే సమయంలో తెలంగాణాలో పార్టీ పదవుల ఎంపిక పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం గెలిచిన 21 నియోజకవర్గాలతో పాటు మరో 60 నియోజకవర్గాల్లో సర్వే చేయిస్తున్నట్టు సమాచారం. జనసేనకు బలం ఉన్న 50 స్థానాలను గుర్తించారు. ఇదే టైం లో తెలంగాణాలో పార్టీ సర్వే టీంను రంగంలోకి డించారు. త్వరలోనే జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షుల నియామకం.. రెండు రాష్ట్రాల్లో ఉండే సూచనలు కనపడుతున్నాయి. ఇంటింటికీ జనసేన కార్యక్రమాన్ని నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారు పవన్.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్