Saturday, September 13, 2025 12:28 AM
Saturday, September 13, 2025 12:28 AM
roots

కేసీఆర్ కి ఊహించని షాక్ ఇచ్చిన కవిత

గత కొన్నాళ్ళుగా ఇంటి పార్టీ పైనే తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్న తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇప్పుడు మరోసారి సంచలన కామెంట్స్ చేసారు. తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కరెక్టే అని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. బీఆర్ఎస్ వాళ్ళు ఆర్డినెన్స్ వద్దని చెప్తున్నారు.. అది తప్పు అన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు మెల్లగా నా దారికి రావాల్సిందే అని, నాలుగు రోజులు టైం తీసుకుంటారేమో అంతే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.

Also Read : మళ్లీ మళ్లీ.. అదే పాత పాట..!

2018 చట్ట సవరణ చేసి ఆర్డినెన్స్ తేవడం సబబేనన్నారు. నేను న్యాయనిపుణులతో చర్చించిన తర్వాతే ఆర్డినెన్స్ కు సపోర్ట్ చేశాను అని వ్యాఖ్యానించారు. నాపై మల్లన్న చేసిన కామెంట్స్ కు బీఆర్ఎస్ పార్టీ రియాక్ట్ కాలేదన్న ఆమె.. దానిని వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నాను అన్నారు. బనకచర్లపై చర్చకు తాను వెళ్లనని సీఎం రేవంత్ రెడ్డి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారని.. నిన్నటి డిల్లీ సమావేశంలో ఎజెండాలో మొదటి అంశమే బనకచర్ల అన్నారు కవిత. ముఖ్యమంత్రి, మంత్రి ఉత్తమ్ సిగ్గులేకుండా గోదావరి జలాలను చంద్రబాబు చేతిలో పెట్టారని మండిపడ్డారు.

బనకచర్లపై చర్చే జరగలేదని రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నాడని.. తెలంగాణ హక్కులను కాలరాసిన నాన్ సీరియస్ ముఖ్యమంత్రి తన పదవి రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. బనకచర్ల వల్ల ఆంధ్రా ప్రజలకు ఏమి లాభం లేదని కాంట్రాక్టర్లు, కమిషన్ల కోసం బనకచర్ల కడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి మెగా కంపెనీ వాటా కోసమే డిల్లీకి వెళ్లారని సంచలన కామెంట్స్ చేసారు. చంద్రబాబు ఎజెండాలో భాగంగానే సీఎం డిల్లీకి వెళ్ళాడని.. బనకచర్ల ఆపకపోతే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.

Also Read : సింగరేణిలో కవితకు షాక్ ఇవ్వడానికి కారణం ఇదేనా..?

పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి అఖిలపక్షాన్ని డిల్లీకి తీసుకువెళ్లాలని డిమాండ్ చేసారు. తన స్కూల్ బీజేపీ, కాలేజీ టీడీపీ, ఉద్యోగం కాంగ్రెస్ లో అని సీఎం చెప్తుంటారని.. ముఖ్యమంత్రి ఇంకా కాలేజ్ లోనే ఉన్నానని అనుకుంటున్నారు. అందుకే గోదావరి నీళ్లను చంద్రబాబు కు గిఫ్టుగా ఇచ్చారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను జనాభా లెక్కలోనుంచి తీసేసానన్న కవిత.. ఆయన ఎవరో నాకు తెలియదు అన్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్