Saturday, September 13, 2025 12:28 AM
Saturday, September 13, 2025 12:28 AM
roots

సింగరేణిలో కవితకు షాక్ ఇవ్వడానికి కారణం ఇదేనా..?

అధికారం కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత రాష్ట్ర సమితిలో వాతావరణం అంత పాజిటివ్ గా కనపడటం లేదు. ముఖ్యంగా కల్వకుంట్ల ఇంటి పోరు పార్టీ నేతలను కన్ఫ్యూజన్ లోకి నెట్టేస్తోంది. తాజాగా ఆ పార్టీలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. తన చెల్లెలు కవితకు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఊహించని షాక్ ఇచ్చారు. తెలంగాణా బొగ్గు గని కార్మిక సంఘం (TBGKS) పార్టీ ఇన్‌ఛార్జ్‌ గా కేటిఆర్ ఆమెను పక్కన పెట్టారు. ఆ బాధ్యతలను పార్టీ సీనియర్ నేత.. కొప్పుల ఈశ్వర్ కు అప్పగించారు.

Also Read : చేతులెత్తేసిన రేవంత్.. చలి కాచుకుంటున్న బిఆర్ఎస్

ఈ పరిణామంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ నేతలు కంగుతిన్నారు. వాస్తవానికి కవిత కంటే కొప్పుల ఈశ్వర్ కు.. కార్మిక సంఘంలో మంచి పట్టు ఉంది. అక్కడి నేతలతో ముందు నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే కవిత ఎంటర్ అయిన తర్వాత.. కాస్త వాతావరణంలో మార్పు వచ్చింది. కవిత మాటకు అక్కడ ఎక్కువ ప్రాధాన్యత ఉండటం, పార్టీకి అనుకూలంగా ఉండే కార్మికులు ఏదైనా కార్యక్రమాలు చేసే సమయంలో ఇతర కీలక నాయకుల మాట కంటే ఆమె మాట ఎక్కువగా వినడం జరిగాయి.

Also Read : చేతులెత్తేసిన రేవంత్.. చలి కాచుకుంటున్న బిఆర్ఎస్

ఇన్నాళ్ళు కవిత.. పార్టీలో కీలకంగా ఉన్నారు కాబట్టి ఈ విషయంలో పెద్దగా సమస్యలు రాలేదు. వాస్తవానికి తెలంగాణా రాజకీయాల్లో సింగరేణి కార్మికులు కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. ఉత్తర తెలంగాణాలో వీరి ప్రభావం ఎక్కువ. వారిలో అనుకూలంగా ఉండేవారిని భవిష్యత్తులో కవిత తన వైపుకు తిప్పుకుంటే సమస్యలు తీవ్రమయ్యే అవకాశం ఉంది. వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో బీఆర్ఎస్ మరిన్ని ఇబ్బందులు పడే అవకాశాలు ఉండవచ్చు. అందుకే కేటిఆర్ ఇప్పుడే జాగ్రత్త పడ్డట్టు రాజకీయ వర్గాలు అంటున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్