Friday, September 12, 2025 11:08 PM
Friday, September 12, 2025 11:08 PM
roots

వర్షా కాలానికి జీర్ణ వ్యవస్థకు సంబంధం ఏంటీ..?

వేసవి ఎండల దెబ్బకు చాలా మంది వర్షా కాలం రావాలని ఎదురు చూస్తూ ఉంటారు. కాని వర్షా కాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలు మాత్రం తీవ్రంగా ఉంటాయి. విష జ్వరాలతో పాటుగా అనేక సమస్యలు వర్షా కాలంలోనే మనం ఎక్కువగా ఎదుర్కొంటాం. అయితే వర్షా కాలంలో జ్వరాలు మాత్రమే కాదు జీర్ణ సంబంధమైన సమస్యలు కూడా తీవ్రంగానే ఉంటాయంటున్నారు నిపుణులు. అధిక తేమ, కలుషితమైన ఆహారం లేదా నీరు, వరదలు వంటి కారణంగా జీర్ణ వ్యవస్థ ఇబ్బందుల్లో పడుతుందని హెచ్చరిస్తున్నారు.

Also Read : ఆ 5 తప్పులే భారత్ ను ఓడించాయా..?

బెంగళూరులోని గ్లెనీగల్స్ బిజిఎస్ హాస్పిటల్‌లో చీఫ్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ ఆదర్శ్ సికె చెప్పిన వివరాల ప్రకారం.. తేమ మరియు చల్లటి ఉష్ణోగ్రతలు గ్యాస్ట్రిక్ సమస్యలను పెంచే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఆహారం కడుపులో ఎక్కువసేపు ఉంటుంది. దీనితో భోజనం చేసిన తర్వాత ఇబ్బరంగా ఉండటం, అసౌకర్యంగా ఉండటం వంటి సమస్యలకు దారి తీస్తుంది. కలుషితమైన ఆహారం లేదా నీరు తీసుకోవడం వల్ల తరచుగా ఉబ్బరం, వికారం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

Also Read : తెలంగాణాలో కీలక అధికారుల అరెస్ట్..?

కొన్నిసార్లు కడుపు నొప్పిగా అనిపిస్తుంది లేదా కొన్ని గంటల పాటు కడుపు నిండుగా ఉండటం జరుగుతూ ఉంటుందట. వర్షాకాలంలో పచ్చి లేదా నూనెతో చేసిన ఆహారాల కంటే వెచ్చని, తాజా భోజనం సులభంగా జీర్ణమవుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఈ సమయంలో స్ట్రీట్ ఫుడ్స్ తినకుండా ఉండటం మంచిదట. భోజనంలో జీలకర్ర, అల్లం లేదా వామును యాడ్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని సూచిస్తున్నారు. తేలికైన, పోషక ఆహారం తింటే మంచిదని, కాబట్టి ఆ దిశగా ప్లాన్ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. వర్షాకాలంలో భారీ ప్రోటీన్ వంటకాలు జీర్ణక్రియను దెబ్బతీస్తాయట. కాబట్టి ప్రోటీన్ ఫుడ్ లైట్ గా తీసుకోవడం మంచిది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్