Friday, September 12, 2025 08:45 PM
Friday, September 12, 2025 08:45 PM
roots

బావా, బామ్మర్దులుగా బాలయ్య, వెంకటేష్..!

ఒకప్పుడు పోటీ పడ్డ టాలీవుడ్ సీనియర్ హీరోలు ఇప్పుడు దోస్త్ మేరా దోస్త్ అంటున్నారు. మల్టీ స్టారర్ సినిమాలు చేసేందుకు సిద్దమైపోతున్నారు. అక్కినేని నాగార్జున, చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, వెంకటేష్ వంటి వారు మల్టీ స్టారర్ సినిమాల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. తమ ఏజ్ కు తగ్గట్టు స్టోరీ సెలెక్షన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మల్టీ స్టారర్ విషయంలో చిరంజీవి ఎప్పటి నుంచో ఆసక్తి చూపిస్తున్నా.. సినిమా మాత్రం ఫైనల్ కాలేకపోయింది. పవన్ కళ్యాణ్ తో సినిమా అని ఎప్పుడో 8 ఏళ్ళ క్రితం ప్రకటన వచ్చింది.

Also Read : ఐటీ హబ్‌గా వైజాగ్‌… లోకేష్‌ కృషికి కంపెనీలు ఫిదా…!!

ఆ సినిమా గురించి మళ్ళీ వార్తలు రాలేదు. ఇక నాగార్జున తమిళ హీరోలతో సినిమాలు చేస్తున్నాడు. వెంకటేష్.. యంగ్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ.. బిజీగా గడుపుతున్నాడు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణతో సినిమా చేస్తున్నా అని యూఎస్ లో అనౌన్స్ చేసాడు. ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరు అనేది మాత్రం వెంకటేష్ చెప్పలేదు. బాలయ్య కూడా చిరంజీవితో ఓ మల్టీ స్టారర్ చేయడానికి రెడీ అయ్యారు. ఫ్యాక్షన్ సినిమా చేసేందుకు సిద్దంగా ఉన్నామని ఇద్దరూ ఓ సందర్భంలో ప్రకటించారు.

Also Read : విరాట్ కోహ్లీ లండన్ అడ్రస్ బయటపెట్టేసిన మాజీ క్రికెటర్

చిరంజీవి కంటే ముందే బాలయ్య.. వెంకటేష్ తో ప్రాజెక్ట్ చేసేందుకు రెడీ అయ్యాడు. అయితే.. ఈ సినిమా గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో ఉంటుందట. బాలయ్యతో గోపిచంద్.. వీర సింహారెడ్డి అనే సినిమా చేసాడు. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. త్వరలోనే బాలయ్యతో మరో సినిమాకు గోపిచంద్ రెడీ అయ్యాడు. ఆ సినిమాలో వెంకటేష్, బాలయ్య కలిసి నటిస్తున్నారనే ఊహాగానాలు బలపడుతున్నాయి. ఇద్దరూ బావా బామ్మర్దులుగా నటిస్తారట. తెలంగాణా బ్యాక్ డ్రాప్ లో ఈ స్టోరీని గోపిచంద్ బిల్డ్ చేస్తున్నట్టు టాలీవుడ్ టాక్. నిర్మాతగా బాలయ్య చిన్న కుమార్తె, రామానాయుడు స్టూడియోస్ వ్యవహరించే ఛాన్స్ ఉంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్