గత కొన్నాళ్ళుగా లండన్ లో నివాసం ఉంటున్న టీం ఇండియా మాజీ క్రికెటర్ విరాట్ కోహ్లీ.. అడ్రస్ పై గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి. అతను లండన్ సమీపంలో నివాసం ఉంటున్నాడు అని కొందరు, అవుట్ సైడ్ లండన్ అని మరికొందరు ఇలా కొన్ని వార్తలు వైరల్ చేసారు. క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ.. పూర్తిగా లండన్ షిఫ్ట్ అయిపోయే అవకాశం ఉందని తెలిసిందే. ప్రస్తుతం క్రికెట్ సీరీస్ ఉన్న సమయంలోనే కోహ్లీ ఇండియా వస్తున్నాడు. మిగిలిన సమయం మొత్తం అక్కడే ఉంటున్నాడు కోహ్లీ.
Also Read : భారత్ వ్యవసాయంపై ట్రంప్ దెబ్బ..!
తన తల్లి, భార్య అనుష్క శర్మ, కుటుంబ సభ్యులు లండన్ లోనే ఉంటున్నారు. కోహ్లీ లేటెస్ట్ గా వింబుల్డన్ లో ప్రత్యక్షం అయ్యాడు. ఇక అతను ఎక్కడ ఉంటున్నాడు అనే దానిపై అడ్రస్ ను రివీల్ చేసాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ జోనాథన్ ట్రాట్. విరాట్ కోహ్లీ ప్రస్తుతం లండన్‌లోని సెయింట్ జాన్స్ వుడ్‌లో నివసిస్తున్నాడని బయటపెట్టాడు. లండన్ లో ఉంటున్నాడు అని తెలిసినా అధికారిక అడ్రస్ మాత్రం ఎవరికీ తెలియదు. ది టెలిగ్రాఫ్‌లోని ఓ కథనంలో కోహ్లీ.. నాటింగ్ హిల్‌లో నివసిస్తున్నట్లు తెలిపింది.
Also Read : కూటమి నేతకు కీలక పదవి..!
తాజాగా స్టార్ స్పోర్ట్స్‌లో జరిగిన డిబేట్ లో ట్రాట్.. కోహ్లీ ప్రస్తుతం సెయింట్ జాన్స్ వుడ్ నివాస ప్రాంతంలో నివసిస్తున్నట్లు తెలిపాడు. వాయువ్య లండన్‌లో ఉన్న ఈ ప్రాంతం అందమైన ఇళ్లకు ప్రసిద్ధి చెందింది. కోహ్లీ 2017 లోనే అక్కడ ఇల్లు కొనుగోలు చేసినట్టు సమాచారం. భారత్ లో ఉంటే స్వేచ్చగా తిరగలేను అనే భావనలో ఉన్న కోహ్లీ లండన్ షిఫ్ట్ అయినట్టు అతని చిన్న నాటి కోచ్ వెల్లడించాడు. కోహ్లీ ప్రస్తుతం వన్డేలలోనే కొనసాగుతున్నాడు. టెస్ట్ క్రికెట్ కు ఐపిఎల్ సమయంలో కోహ్లీ గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.