తెలంగాణాలో జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక సందడి నెలకొంది. ప్రస్తుత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన స్థానానికి త్వరలో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. దీనితో పోటీలో నిలబడే రాజకీయ పార్టీలు ఈ ఎన్నికను సీరియస్ గా తీసుకున్నాయి. కీలక నాయకులు ఇప్పటికే ఇక్కడ పోటీ గురించి వ్యూహాలు రచిస్తున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ బరిలోకి దిగే అవకాశం ఉందనే ప్రచారం నేపధ్యంలో.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి.
Also Read : అప్పుడు లేని నొప్పి ఇప్పుడు ఎందుకు..? మస్క్ పై ట్రంప్ సీరియస్
ఇక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. టీడీపీ కూడా బరిలోకి దిగితే మాత్రం భారత రాష్ట్ర సమితి ఇబ్బంది పడే అవకాశం ఉండవచ్చనే అభిప్రాయాలు సైతం వినపడుతున్నాయి. ఈ తరుణంలో తాజాగా ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. ఉప ఎన్నికకకు టీడీపీ దూరంగా ఉండాలని.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. ఇటీవలే ఏపీ మంత్రి లోకేష్ ను హైదరాబాద్లో మూడు రోజుల క్రితం ఒక ఆంధ్ర వ్యాపారవేత్త పుట్టినరోజు వేడుకలో కేటిఆర్ కలిసారట.
Also Read : కష్టాల క్రికెట్.. ఆకాష్ దీప్ జీవితంలో వరుస విషాదాలు
పొత్తులో భాగంగా మీ ఎన్డీయే అభ్యర్థికి టికెట్ ఇస్తారు అని తెలుసని.. ఈ ఎన్నికలకు మీరు దూరంగా ఉంటే నేను మాగంటి కుటుంబ సభ్యులకు టికెట్ ఇస్తానని లేదంటే వేరే అభ్యర్థికి ఇస్తానని చెప్పినట్టు సమాచారం. ఎంత కాదన్న మీ మాజీ ఎమ్మెల్యే, మీ పార్టీ అన్న మీ నాయకుడు బాబు గారు అన్న చాలా గౌరవం చూపించే వారు మాగంటి గోపీనాథ్ గారు… నన్ను పర్సనల్ గా కలిసిన ప్రతి సారి రాజకీయ చర్చ వచ్చినప్పుడు మీ పార్టీ విధి విధానాల గురించి చెప్పే వాడని లోకేష్ వద్ద ప్రస్తావించారని.. అవసరమైతే చంద్రబాబుతో ఇదే అంశం గురించి తాను చర్చిస్తాను అని.. దాదాపు 20 నిమిషాలు కేటిఆర్.. లోకేష్ తో మాట్లాడినట్టు సమాచారం.