బర్మింగ్‌హామ్ వేదికగా భారత్ – ఇంగ్లాండ్ దేశాల మధ్య జరగనున్న రెండో టెస్ట్ లో భారత జట్టు కీలక మార్పులు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. మొదటి టెస్ట్ ప్రదర్శనను దృష్టిలో ఉంచుకున్న జట్టు యాజమాన్యం రెండో టెస్ట్ లో బ్యాటింగ్, బౌలింగ్ ఆర్డర్ లో మార్పులు చేయాలని భావిస్తోంది. బౌలింగ్ ఆల్ రౌండర్ తో పాటుగా బ్యాటింగ్ లో కూడా కీలక మార్పులు చేస్తోంది. బౌలింగ్ విషయంలో తీవ్ర విమర్శలు రావడంతో జాగ్రత్తలు పడుతోంది. మొదటి టెస్ట్ లో విఫలమైన ఆటగాళ్లను రెండో టెస్ట్ లో తప్పించే అవకాశాలు కనపడుతున్నాయి.
Also Read : దుబారాలో పరాకాష్ట.. ఇదేందయ్యా..!
బౌలింగ్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇక సాయి సుదర్శన్ ను తప్పించి అతని స్థానంలో కరుణ్ నాయర్ ను బ్యాటింగ్ కు పంపే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక బౌలింగ్ లో అర్శదీప్ సింగ్ కు అవకాశం కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. శార్దుల్ ఠాకూర్ స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఠాకూర్ మొదటి టెస్ట్ లో ఏ మాత్రం ప్రభావం చూపలేదు. ఒకవేళ సాయి సుదర్శన్ ను ఆడించాల్సి వస్తే అతనిని మిడిల్ ఆర్డర్ కు పంపే అవకాశం ఉంది.
Also Read : ముందు ఆ విషయం పై క్లారిటీ ఏదీ..?
బౌలింగ్ విభాగంలో బూమ్రా రెండో టెస్ట్ ఆడటం ఖాయంగా కనపడుతోంది. ప్రసిద్ కృష్ణ లేదంటే సిరాజ్ ను పక్కన పెట్టె అవకాశాలు ఉండవచ్చు. కెప్టెన్ గిల్ బ్యాటింగ్ ఆర్డర్ కూడా మారే అవకాశాలు ఉండవచ్చు అంటున్నారు. సుందర్ తుది జట్టులోకి వచ్చేస్తే మాత్రం అతను బ్యాటింగ్ లో ఎక్కువగా జట్టుకు సహకరించే అవకాశం ఉంటుంది. బౌలింగ్ లో కూడా ప్రభావం చూపే ఆటగాడు. మొదటి టెస్ట్ లో ఫెయిల్ అయిన జడేజాను కూడా తుది జట్టు నుంచి తప్పించే అవకాశాలు సైతం కనపడుతున్నాయి.