Friday, September 12, 2025 07:04 PM
Friday, September 12, 2025 07:04 PM
roots

మరో ఇద్దరు హీరోయిన్ల ఫోన్ ట్యాప్..?

తెలంగాణాలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు సంచలనాలకు వేదికగా మారుతోంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో సినీ, రాజకీయ, వ్యాపార, మీడియా ప్రముఖులు కూడా బాధితులే అనే విషయం బయటకు రావడంతో ఏ పరిణామాలు ఉంటాయా అనేది ఆసక్తిగా మారింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటూ అప్పట్లో కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై కాంగ్రెస్ సర్కార్ విచారణ మొదలుపెట్టింది. అక్కడి నుంచి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Also Read : బ్లాక్ బాక్స్ డేటా డౌన్లోడ్.. ఎయిర్ ఇండియా ప్రమాదంలో కీలక పరిణామం

ముఖ్యంగా సినిమా వాళ్ళ ఫోన్ లు ట్యాపింగ్ చేసారు అనేది ప్రధాన ఆరోపణ. సమంతా, రకుల్ ప్రీత్ సింగ్ సహా పలువురు హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు విమర్శలు వచ్చాయి. ఇక ఇటీవల ఇషా రెబ్బా ఫోన్ కూడా ట్యాప్ అయినట్టు గుర్తించారు. ఇక తాజాగా మరో హీరోయిన్ పేరు బయటకు వచ్చింది. హేబ్బా పటేల్ ఫోన్ కూడా ట్యాపింగ్ అయినట్టు తేలింది. దీనితో సిట్ ఆమెకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆమెతో పాటుగా మరో హీరోయిన్ ఫోన్ కూడా ట్యాపింగ్ కు గురైనట్టు సమాచారం.

Also Read : డబ్బు కోసం లైంగిక వీడియోల అమ్మకం.. హైదరాబాద్ జంట అరెస్ట్

ఆమెతో సన్నిహితంగా ఉండే హీరోయిన్ ఫోన్ ను ట్యాప్ చేసారని మీడియాలో మరో వార్త బయటకు వచ్చింది. ఇక ఇదే కేసులో ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ ఫోన్ ను ట్యాప్ చేసినట్టు గుర్తించిన సిట్ అధికారులు.. ఆయనను విచారణకు పిలిచారు. ఆయనతో పాటుగా మరో మీడియా సంస్థ అధినేతకు కూడా నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. ఇలా ఈ ఫోన్ ట్యాపింగ్ లో త్వరలోనే మరిన్ని సంచలనాలు నమోదు కావడం ఖాయం అంటున్నాయి రాజకీయ వర్గాలు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్