Wednesday, October 22, 2025 10:02 PM
Wednesday, October 22, 2025 10:02 PM
roots

ఇరాన్ కు ట్రైనింగ్ ఇచ్చిన అమెరికానే ఇప్పుడు ఎందుకు టెన్షన్ పడుతోంది..?

అణు ఆయుధాల విషయంలో ఇరాన్ కు అమెరికా ఎదురు వెళ్ళడం, ఆ తర్వాత ఇజ్రాయిల్.. ఇరాన్ లక్ష్యంగా దాడులు చేయడం.. గత రెండు వారాలుగా మూడవ ప్రపంచ యుద్ధం వస్తుందనే ప్రచారం జరగడం.. ప్రపంచాన్ని కలవరపెట్టింది. రష్యా, చైనా వంటి దేశాలు ఇరాన్ కు మద్దతుగా ఉండటంతో.. అమెరికా పప్పులు ఉడకడం కష్టమే అనే అభిప్రాయాలు బలంగా వినిపించాయి. చైనాకు పెద్ద ఎత్తున చమురు సరఫరా చేసే ఇరాన్.. రష్యాతో కూడా వ్యాపార భాగస్వామిగా ఉంది. దీనితో ఇజ్రాయిల్ పై పెద్ద ఎత్తున దాడులకు దిగింది.

Also Read : ఆ బాధ్యత మీదే.. మంత్రులకు రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్

ఇక ఇరాన్ దారికి రాకపోవడంతో రెండు దేశాల మధ్య శాంతి నెలకొల్పా అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఓ ప్రకటన చేసారు. ఆ తర్వాత కూడా ఇజ్రాయిల్ దాడులు చేసే ప్రయత్నం చేసింది. ఇదిలా ఉంచితే.. ఇరాన్ – అమెరికా ఒప్పందాల విషయంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పౌర అణు సాంకేతిక పరిజ్ఞానాన్ని మిత్రదేశాలతో పంచుకోవడానికి అమెరికా మాజీ అధ్యక్షుడు డ్వైట్ డి ఐసెన్‌హోవర్ మొదలుపెట్టిన ‘అటామ్స్ ఫర్ పీస్’ కార్యక్రమం అప్పట్లో ఓ సంచలనంగా మారింది.

Also Read : పొగాకు రైతులకు 24 గంటల్లోనే.. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం

1960లలో టెహ్రాన్‌లో అణు రియాక్టర్‌ను ఏర్పాటు చేయడంలో అమెరికన్ శాస్త్రవేత్తలు సహాయం చేసారు. దశాబ్దాల తర్వాత, ఇప్పుడు వారు ముప్పుగా భావిస్తున్న అణు ప్రయోగాలను అడ్డుకోవడానికి అమెరికా యుద్ధ విమానాలు ఇరానియన్ అణు కేంద్రాలపై బాంబు దాడులు చేసాయి. షా మొహమ్మద్ రెజా పహ్లావి పాలించిన ఇరాన్ తో అప్పట్లో అమెరికాకు మంచి సంబంధాలు ఉండేవి. తమ దేశ అభివృద్ధి కోసం ఇరాన్.. అమెరికాతో స్నేహం చేసింది. తమతో కలిసి పని చేసే అమెరికా సంస్థల ద్వారా.. ఇరానియన్ శాస్త్రవేత్తలకు శిక్షణ ఇచ్చింది అమెరికా.

Also Read : మాట నెగ్గించుకున్న అమ్రాపాలి

అదే సమయంలో సోవియట్ యూనియన్ ను కట్టడి చేయడానికి ఇరాన్ ద్వారా ప్రయత్నాలు చేసింది. ఇరాన్ తో పాటుగా మధ్య ప్రాచ్య దేశాల్లో పలు ప్రాంతాల్లో అమెరికా తమ మిలటరీ బేస్ క్యాంప్ లు ఏర్పాటు చేసింది. అమెరికా సాయం తర్వాత ఇరాన్ స్వయంగా తమ దేశంలోనే అణు ఆయుధాలను అభివృద్ధి చేసుకునే ప్రయత్నాలు చేయడం అమెరికాను కంగారు పెట్టింది. ఆ రోజుల్లో అణు విస్తరణ గురించి అమెరికా పెద్దగా ఆందోళన చెందలేదు. కాని క్రమంగా ఇరాన్ బలపడటంతో.. సోవియట్ యూనియన్ కు సహాయం చేస్తుందని అమెరికా భయపడినట్టు ఆ దేశ మాజీ సైనిక అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు పశ్చిమాసియాలో పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో మరోసారి ఇరాన్ పై పెత్తనం కోసం అమెరికా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

నా తండ్రికి ఆమె...

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక రోజు...

బ్రేకింగ్: డీఎస్పీకి అండగా...

తెలుగు రాష్ట్రాల్లో జూదం, కోడి పందాలు...

ఎమ్మెల్యే బావమరిదిని కంట్రోల్...

రాజకీయ నాయకుల అవినీతి వ్యవహారాల విషయంలో...

జోగి రమేష్ సంగతేంటి..?...

ఆంధ్రప్రదేశ్ కల్తీ మద్యం కేసు వెనకడుగు...

డీఎంకే నేతలతో కలిసి...

ఆంధ్రప్రదేశ్ కల్తీ మధ్య వ్యవహారానికి, తమిళనాడు...

పర్యటన తెచ్చిన తంటాలు..!

ఒక పర్యటన ఇప్పుడు సిక్కోలు జిల్లా...

పోల్స్