వైఎస్ జగన్ రెంటపాళ్ళ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు అత్యంత వివాదాస్పదంగా మారాయి. బెట్టింగ్ లతో అప్పుల పాలైన వ్యక్తి మరణిస్తే జగన్ పరామర్శించి.. విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడం ఆశ్చర్యం కలిగించింది. ఇక కమ్మ సామాజిక వర్గానికి జగన్ న్యాయం చేసే విధంగా అక్కడ మాట్లాడటం సైతం విస్మయానికి గురి చేసిన అంశం. ఇక జగన్ పర్యటన సందర్భంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం వివాదాస్పదంగా మారిన అంశం. వారికి టీడీపీ నేతలు ఆర్ధిక సాయం చేసారు.
Also Read : బాబోయ్.. నాకేం సంబంధం లేదు..!
ఇదిలా ఉంచితే.. అక్కడ ఫ్లకార్డులు ప్రదర్శించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తిరుపతి గంగ జాతరతో వేట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుకుతాం అన్నట్టు ప్రదర్శించిన ఓ ఫ్లకార్డు, రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తామనే మరో ఫ్లకార్డు సంచలనంగా మారాయి. వీటిని సమర్ధిస్తూ జగన్ తన ప్రెస్ మీట్ లో వ్యాఖ్యలు చేసారు. ఏదో కోపంతో, అభిమానంతో వాటిని ప్రదర్శించారు అంటూ జగన్ ఆ డైలాగులు కూడా చెప్పారు. దీనిపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడారు.
Also Read : ఫోన్ ట్యాపింగ్ లో మరో సంచలనం
రప్పా, రప్పా ఎవరిని నరుకుతావ్ జగన్ అంటూ నిలదీశారు పయ్యావుల. సినిమాలు ఎన్నో ఉన్నాయి అందులో ఎన్నో మంచి డైలాగులు ఉన్నాయని.. మోడీ ఫాలోవర్స్ ఎలాంటి డైలాగులు చెప్తున్నారు? జగన్ ఫాలోవర్స్ ఎలాంటి డైలాగులు చెప్తున్నారు? అని నిలదీశారు. కుర్రాడు తెలియక చేశాడు ఇలాంటి వాటిని నేను ప్రోత్సహించను అని చెప్పాల్సింది పోయి సంతోషమే అంటున్నారని పయ్యావుల మండిపడ్డారు. జగన్ మనస్తత్వం ఎలా ఉందో ఆయనకు మద్దతు ఇచ్చే వారి మనస్తత్వం కూడా అలాగే ఉందని విమర్శించారు పయ్యావుల.