ఎన్నికల ముందు వరకు ఎగిరెగిరి పడ్డారు.. పార్టీ టికెట్ కోసం తెగ ప్రయత్నాలు చేశారు. అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు నానా పాట్లు పడ్డారు. పార్టీ పెద్దల దృష్టిలో పడేందుకు నాటి ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. అయితే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం మాత్రం రాలేదు. పార్టీ ఓడింది.. ఇక అంతే.. ఏమయ్యారో తెలియదు.. ఇప్పుడు ఎక్కడున్నారో కూడా అడ్రస్ లేదు.. ఇంతకీ ఎవరు వాళ్లు.. వాళ్ల కథ ఏమిటనేది ఇప్పుడు ఆ జిల్లాలో హాట్ టాపిక్.
Also Read : తండ్రీ, కొడుకుల అరెస్టుకు రంగం సిద్ధం..? ఎమ్మార్వోకి మూడింది..?
తండ్రి అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయారు. ప్రతిపక్షనేతలపై దాడులు చేశారు. ఎవరైనా వైసీపీని తిడితే.. వారి సంగతి అంతే.. ఇక నాటి ప్రభుత్వ తీరును ప్రశ్నించినా సరే.. ఇక అంతే సంగతులు.. ఇదంతా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నాటి ప్రభుత్వ పెద్దల వారసుల తీరు. ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత తాము చేసిన తప్పులకు శిక్ష తప్పదనే భయంతో ఎక్కడి దొంగలు అక్కడే.. గప్ చుప్ సాంబార్ బుడ్డి.. అన్నట్లుగా సైలెంట్ అయిపోయారు. ఒకరేమో అప్పుడప్పుడు కనిపిస్తున్నారు… మరొకరేమో సైలెంట్‌గా మకాం మార్చేశారు. ఇక జూనియర్ జగన్ మాత్రం రోగం వచ్చిందని ఆసుపత్రిలో చేరిపోయారు.
Also Read : విషం చిమ్ముతున్న వారి కోరలు పీకుతారా..?
ధర్మాన సోదరులతో పాటు మాజీ సభాపతి తమ్మినేని సీతారాం వారసులు ఎక్కడా అనేది ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో హాట్ టాపిక్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని తామే అయి నియోజకవర్గంలో పెత్తనం చేశారు. మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కుమారుడు డా.చైతన్య పోలాకి మండలం జెడ్‌పీటీసీగా పోటీ చేసి గెలిచారు. పేరుకే జెడ్పీటీసీ అయినప్పటికీ.. నియోజకవర్గంతో పాటు జిల్లా పరిషత్‌లో కూడా చైతన్య చక్రం తిప్పారు. ఆయన చెప్పిందే వేదం. చివరికి నరసన్నపేట నియోజకవర్గంలో ఏ చిన్న పని చేయాలన్నా సరే.. ముందుగు చైతన్య అనుమతి తప్పనిసరి. ఇక మరో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. జిల్లాలోనే సీనియర్ నేతగా గుర్తింపు తెచ్చుకున్న ధర్మాన ప్రసాదరావు తన రాజకీయ వారసునిగా కుమారుడు రామ్ మనోహర్ నాయుడును తెరపైకి తీసుకువచ్చారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా మనోహర్ నాయుడు పాల్గొన్నారు. ర్యాలీలు నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లారు. అయితే ఇందంతా ఎన్నికల ముందు జరిగిన వ్యవహారం.
Also Read : భారతీ మేడం.. సారి.. తప్పైంది.. మన్నించండి ప్లీజ్..!
ఇక మాజీ సభాపతి తమ్మినేని సీతారాం కుమారుడు చిరంజీవి నాగ్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అయితే ఎలాంటి అధికార హోదా లేకపోయినప్పటికీ.. ఏకంగా జిల్లా పరిషత్ రివ్యూ సమావేశాల్లో వేదికపైనే ఆశీనులయ్యారు. ఎలా రానిచ్చారని అప్పట్లో ఎవరైనా ప్రశ్నిస్తే.. వారిపై దాడులు కూడా చేశారు. అమరావతి ప్రాంతాన్ని తమ్మినేని సీతారాం ఎడారితో పోలిస్తే.. చిరంజీవి నాగ్ అయితే.. దానిపై అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. చిరంజీవ్ నాగ్ కు మరో ముద్దు పేరు కూడా ఉంది. అదేమిటంటే.. సిక్కోలు జగన్ అనే నిక్ నేమ్. జగన్‌ను బాగా ఇమిటేట్ చేస్తాడని నాగ్‌ను సిక్కోలు జగన్ అని అభిమానులు పిలుచుకుంటారు.
Also Read : ఆయన చెప్పినట్లే.. గీత దాటితే అంతే..!
ఎన్నికల్లో వారసులు పోటీ చేసేందుకు ఈ ముగ్గురు నేతలు కూడా బాగా ప్రయత్నం చేశారు. తమ వారసునికే టికెట్ ఇవ్వాలని అధినేతపై ఒత్తిడి కూడా తీసుకువచ్చారు. సర్వే ఫలితాలు కూడా మార్ఫింగ్ చేసి వైసీపీ పెద్దలకు పంపారు. అయితే అధినేత జగన్ మాత్రం.. నో చెప్పారు. ఈసారికి మీకే.. వచ్చే ఎన్నికల్లో ఇస్తా అని హామీ ఇచ్చారు. దీంతో సరే అని పోటీ చేశారు.. ఓడిపోయారు. నేతల ఓటమి తర్వాత వారసులు అడ్రస్ లేకుండా పోయారు. తమ్మినేని సీతారాం కొడుకు అనారోగ్య సమస్యలంటూ హైదరాబాద్‌లో ఆసుపత్రిలో చేరారు. ధర్మాన ప్రసాదరావు కుమారుడు రామ్ మనోహర్ నాయుడు సిక్కోలు నుంచి మకాం మార్చేశారు. ధర్మాన కృష్ణదాస్ కుమారుడు మాత్రం.. అప్పుడప్పుడు జిల్లా పరిషత్ సమావేశాలకు వస్తున్నప్పటికీ.. నోరు మెదపటం లేదు. అధికారంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద మాటలు చెప్పిన ఈ వారసులు.. పార్టీ ఓడిన తర్వాత మాత్రం అడ్రస్ లేకుండా పోవటం పట్ల పార్టీ నేతలే గుర్రుగా ఉన్నారు.




