Wednesday, August 5, 2026 07:36 AM
Wednesday, August 5, 2026 07:36 AM

సచివాలయానికి దూరంగా మంత్రులు..? బాబు వార్నింగ్

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆరోపణ మంత్రుల మీద ఎక్కువగా వినిపించేది. అప్పట్లో ముఖ్యమంత్రి తో సహా చాలామంది మంత్రులు సచివాలయానికి వెళ్లేవారు కాదు. దీనితో పాలన పడకేసింది అనేది అప్పట్లో విపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపించేవి. కీలక ఫైల్స్ సైతం ఎక్కువగా వైయస్ జగన్ ఇంట్లోనే సంతకాలు అయ్యేవి. మంత్రుల సమీక్ష సమావేశాలు కూడా అప్పట్లో సజ్జల రామకృష్ణారెడ్డి నిర్వహించేవారు. ఇక ఇప్పుడు కొంతమంది మంత్రుల వ్యవహార శైలి కూడా అలాగే ఉందనేది ప్రధాన ఆరోపణ.

Also Read : వైసీపీకి మరో రాజ్యసభ ఎంపీ రాంరాం

ముగ్గురు నలుగురు మంత్రులు సచివాలయానికి వెళ్లడం లేదనే విమర్శలు వస్తున్నాయి. విజయవాడలో ఉంటున్నా సచివాలయానికి మాత్రం దూరంగానే ఉంటున్నారు. అధికారులు కూడా మంత్రుల క్యాంప్ ఆఫీసులోనే పనులు చేయడం జరుగుతోంది. నాలుగు నెలల క్రితం మంత్రిపై ఇవే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు కూడా అదే ఆరోపణలు మరో ముగ్గురు మంత్రులపై వస్తున్నాయి. సచివాలయానికి దూరంగా ఉండే మంత్రుల విషయంలో సీఎం చంద్రబాబు కాస్త అసహనంగా ఉన్నారట. కేవలం క్యాబినెట్ సమావేశం జరిగే సమయంలోనే మంత్రులు సచివాలయానికి వెళ్తున్నారు.

Also Read : ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చేందుకు బాబు, పవన్ రెడీ

అమరావతి పనుల మీద కూడా మంత్రులు అవగాహన పెంచుకోవడంలేదని ఆరోపణ వినపడుతోంది. ఇటీవల పనులు మొదలైన తర్వాత కొంతమంది మంత్రులు అమరావతి వెళ్లలేదట. ఇక పేషీలో ఏం జరుగుతుందో కూడా కొంతమంది మంత్రులు పట్టించుకోవడంలేదనే విమర్శ సైతం వినపడుతోంది. పెత్తనం మొత్తం ఓఎస్డీలకు అప్పగించారని.. కీలక ఫైల్స్ ను మానిటర్ చేయటం లేదనేది ప్రభుత్వ వద్దకు సమాచారం వెళ్ళింది. దీనిపై కొందరు మంత్రులను ఇటీవల క్యాబినెట్ సమావేశం సందర్భంగా చంద్రబాబు నాయుడు వివరణ కూడా అడిగినట్లు సమాచారం. మరి మంత్రుల వ్యవహార శైలిలో ఎప్పుడు మార్పు వస్తుందో చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్