Monday, October 27, 2025 10:27 PM
Monday, October 27, 2025 10:27 PM
roots

చేరికలపై చంద్రబాబు సంచలన నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీల నుంచి చేరికలు మూడు పార్టీల్లో ఎక్కువయ్యాయి. టిడిపి తో పాటుగా జనసేన, బిజెపిలోకి ఈ మధ్యకాలంలో పలువురు నాయకులు జాయిన్ అవుతున్నారు. వైసిపి నుంచి పెద్ద ఎత్తున చేరికలు నడుస్తున్నాయి. టిడిపిలోకి వెళ్లే అవకాశం లేని నాయకులు వైసిపి నుంచి జనసేనలోకి వెళ్తున్నారు. ఇటీవల ఉత్తరాంధ్రకు చెందిన కొందరు నాయకులు బిజెపిలో జాయిన్ అయ్యారు. అయితే ఈ చేరికల విషయంలో టిడిపి క్యాడర్ అసహనం వ్యక్తం చేస్తోంది.

Also Read : ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చేందుకు బాబు, పవన్ రెడీ

ముఖ్యంగా టిడిపిలో జాయిన్ అవుతున్న వారి విషయంలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నియోజకవర్గంలో అలజడి సృష్టించేందుకు కొంతమంది నాయకులు ప్రయత్నం చేస్తున్నారని.. అందుకే వారు పార్టీ మారేందుకు ఆసక్తి చూపిస్తున్నారని విమర్శలు సైతం ఉన్నాయి. ఇక పార్టీ మారిన తర్వాత కొంతమంది వ్యక్తులకు ఎమ్మెల్యేలతో పాటుగా మంత్రులు కూడా ప్రాధాన్యత ఇవ్వడాన్ని టిడిపి కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. జిల్లాల్లో పార్టీలో చీలిక రావడానికి వీరే కారణం అనే విమర్శలు సైతం ఉన్నాయి. ఈ తరుణంలో టిడిపి అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది.

Also Read : ముద్రగడ ఆరోగ్యంపై అనుమానాలు..!

కాసేపటి క్రితం టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేరుతో లేఖను టిడిపి అధిష్టానం విడుదల చేసింది. టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఇతర పార్టీల నాయకులను టిడిపిలోకి జాయిన్ చేసుకునే ముందు తప్పనిసరిగా వారి గురించి కేంద్ర కార్యాలయానికి తెలియజేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు. వారి గురించి పూర్తిగా కేంద్ర కార్యాలయం విచారణ చేసిన తర్వాత పార్టీ అనుమతితో వారిని పార్టీలోకి ఆహ్వానించాల్సి ఉంటుందని ఈ విషయం తెలుగుదేశం పార్టీలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు అందరూ గమనించగలరని పేర్కొంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్