భారత్ – ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న టెస్టు సిరీస్ ఆసక్తిని రేపుతోంది.. కొత్త ఆటగాళ్లతో భారత్ ఈసారి కఠిన పరీక్షను ఇంగ్లాండులో ఎదుర్కొనుంది. కెప్టెన్ గిల్ జట్టును ఎంతవరకు నడిపిస్తాడనే దానిపై అభిమానుల్లో సందేహాలు నెలకొన్నాయి. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా ఈ సీరిస్ ను సీరియస్ గా తీసుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఓటమి నేపథ్యంలో ఈ సిరీస్ విజయం అత్యంత కీలకంగా మారింది.
Also Read : అరెస్ట్ కోహ్లీ.. సోషల్ మీడియాలో సంచలనం
సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండానే ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్ళింది భారత జట్టు. బౌలింగ్ విభాగంలో కూడా మహమ్మద్ షమీ లేకుండానే ఇంగ్లాండ్ లో అడుగుపెట్టింది. సాయి సుదర్శన్, కరణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్.. వంటి ఆటగాళ్లు ఇంగ్లాండ్ లో అదృష్టం పరీక్షించుకోనున్నారు. రెండవ ప్రాక్టీస్ మ్యాచ్ నేటినుంచి మొదలుకానున్న నేపథ్యంలో.. సీనియర్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్ , రిషబ్ పంత్.. ఆడే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ సిరీస్ లో విజయం సాధిస్తే గంభీర్ పై విమర్శలు కూడా తగ్గే అవకాశాలుంటాయి. స్వింగ్ కు అనుకూలంగా ఉండే ఇంగ్లాండ్ మైదానాల్లో భారత ఆటగాళ్లు ఎంత వరకు ప్రభావం చూపుతారు అనేది కూడా ఆసక్తిగా మారింది.
Also Read : అయ్యర్ పై యువరాజ్ తండ్రి సంచలన కామెంట్స్
కరుణ్ నాయర్ , సాయి సుదర్శన్ ఇంగ్లాండ్ లో కౌంటి క్రికెట్ ఆడారు. దీనితో వాళ్లు మెరుగైన ప్రదర్శన చేయవచ్చని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఈ సిరీస్ పేరు కూడా మారింది. ఇప్పటివరకు పటౌడీ సీరిస్ గా పిలుస్తున్న ఈ ద్వైపాక్షిక సీరిస్ ను ఇప్పటినుంచి అండర్సన్ – టెండూల్కర్ సీరిస్ గా పిలవనున్నారు. ఇంగ్లాండ్ క్రికెట్ లెజెండ్ జేమ్స్ అండర్సన్, భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేర్లతో ఇకనుంచి రెండు దేశాల మధ్య సీరిస్ జరగనుంది. అత్యంత ప్రతిష్టాత్మక సీరిస్ చెప్పుకొనే.. ఈ సిరీస్ లో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి. తొలి మ్యాచ్ జూన్ 20న మొదలుకానుంది.




