Friday, September 12, 2025 07:23 PM
Friday, September 12, 2025 07:23 PM
roots

గరం గరం గన్నవరం..!

ఏపీలో గన్నవరం నియోజకవర్గానిది ప్రత్యేక గుర్తింపు. విజయవాడ పక్కనే ఉన్న నియోజకవర్గం కావడంతో అక్కడ జరిగే ప్రతి విషయం కూడా ఇట్టే తెలిసిపోతుంది. అయితే గన్నవరం ఈ స్థాయిలో గుర్తింపు రావడానికి ప్రధాన కారణం మరో నేత కూడా. ఆయనే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. తెలుగుదేశం పార్టీ తరఫున వరుసగా రెండుసార్లు పోటీ చేసి గెలిచారు. రెండోసారి గెలిచిన తర్వాత వంశీ తీరు ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి వరకు చంద్రబాబును దేవుడితో సమానం అని వ్యాఖ్యానించిన వంశీ.. వైసీపీలో చేరిన నాటి నుంచి దారుణమైన వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు. ఒకదశలో ఇంట్లో మహిళల పట్ల చాలా నీచంగా వ్యాఖ్యలు చేశారు వంశీ. గన్నవరంలో చంద్రబాబు, లోకేష్ కలిసి పోటీ చేసి గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. నాటి నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

Also Read : మరో షాక్ ఇవ్వడానికి రెడీ అయిన కోహ్లీ..?

వంశీ వ్యాఖ్యల పట్ల టీడీపీ నేతలు భగ్గుమన్నారు. వంశీ చేసిన వ్యాఖ్యల వల్ల గన్నవరం నియోజకవర్గం హాట్ టాపిక్‌గా మారిపోయింది. అదే సమయంలో గన్నవరంలో టీడీపీ ఆఫీసుపై దాడి, లోకేష్ యువగళం పాదయాత్ర సమయంలో రెచ్చగొట్టేలా వ్యవహరించడం, పాదయాత్ర అడ్డుకునేందుకు యత్నించడం.. ఇలా ఎన్నో అరాచకాలు సృష్టించారు. ఇక ఎన్నకల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన వంశీ.. ఓటమి తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వంశీ ప్రస్తుతం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వంశీ అరెస్టు తర్వాత నియోజకవర్గంలో వైసీపీని నడిపించే లీడర్ కరువయ్యాడు. దీంతో గన్నవరం నియోజకవర్గంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు.

Also Read : పొత్తుపై కీలక వ్యాఖ్యలు.. వారికి మాస్ వార్నింగ్..!

గన్నవరంలో వంశీ అరెస్టు తర్వాత వైసీపీని నడిపించే నేత ఎవరు అనే ప్రశ్న తలెత్తింది. దీంతో నియోజకవర్గం ఇంఛార్జ్ బాధ్యతల నుంచి వంశీని తప్పించి మరొకరికి అప్పగించాలని జగన్ భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో వంశీపై పోటీ చేసి ఓడిన యార్లగడ్డ వెంకట్రావు ఆ తర్వాత టీడీపీలో చేరారు. 2024 ఎన్నికల్లో పోటీ చేసిన యార్లగడ్డ ఎమ్మెల్యే అయ్యారు. ఇక వంశీ అరెస్టు తర్వాత వైసీపీ క్యాడర్‌ డైలమాలో పడింది. నడిపించే లీడర్ కోసం ఎదురుచూస్తోంది. దీంతో స్వయంగా రంగంలోకి దిగిన జగన్.. గన్నవరం నియోజకవర్గం నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. నియోజకవర్గం బాధ్యతలు చూస్తున్న మాజీ మంత్రి పేర్ని నానితో చర్చించారు. వంశీ స్థానంలో దుత్తా రామచంద్రరావు కుమార్తెకు నియోజకవర్గం బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే.. మరి మా పరిస్థితి ఏమిటని వంశీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్