Friday, September 12, 2025 08:59 PM
Friday, September 12, 2025 08:59 PM
roots

మరో షాక్ ఇవ్వడానికి రెడీ అయిన కోహ్లీ..?

ఐపీఎల్ చివరి దశకు చేరుకుంది. ఎంతో ఉత్కంఠ గా సాగిన ఈ సీజన్ లో మరో మూడు మ్యాచులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అందరూ ఊహించినట్లుగానే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫైనల్ కు దూసుకు వెళ్లింది. గురువారం సాయంత్రం జరిగిన క్వాలిఫైయర్ 1 లో బెంగళూరు జట్టు ఏకపక్ష విజయం సాధించి ఫైనల్ కు అర్హత సాధించింది. దీనితో 2016 తర్వాత ఐపీఎల్ ఫైనల్ కు ఆర్సిబి వెళ్ళింది. గత ఏడాది తడబడిన ఆర్సిబి జట్టు ఈ ఏడాది మాత్రం ఆది నుంచి ఆధిపత్యం చెలాయించింది.

Also Read : అధినేతపై సన్నగిల్లుతున్న నమ్మకం..!

స్టార్ ఆటగాళ్ల నుంచి ప్రతి ఒక్కరు అద్భుతమైన ప్రదర్శనలు చేయడంతో ఐపీఎల్ లో కంప్లీట్ డామినేషన్ ప్రదర్శించింది. అయితే ఫైనల్ లో ఆర్సిబి విజయం సాధిస్తే ఆ జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఐపిఎల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది సీజన్లో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్న కోహ్లీ వరుసగా ఆరుసార్లు 600 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కోహ్లీ తో పాటుగా ఇతర ఆటగాళ్లు కూడా మెరుగైన ప్రదర్శన చేయడం ఆ జట్టుకు కలిసి వచ్చిన అంశంగా చెప్పాలి.

Also Read : పొత్తుపై కీలక వ్యాఖ్యలు.. వారికి మాస్ వార్నింగ్..!

అయితే కోహ్లీ.. ఆర్సిబి గనుక విజయం సాధిస్తే రిటైర్ అవుతాడు అనే ప్రచారం అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది. గత ఏడాది జరిగిన టి20 వరల్డ్ కప్ తర్వాత కోహ్లీ ఆ ఫార్మేట్ కు గుడ్ బై చెప్పాడు. ఈ ఏడాది అనూహ్యంగా టెస్ట్ క్రికెట్ కు కూడా గుడ్ బై చెప్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు ఐపీఎల్ లో విజయం సాధిస్తే దీనికి కూడా గుడ్ బై చెప్పే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీనిపై స్పష్టత లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆ జట్టుకు ఆ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ రావడానికి కోహ్లీ కారణం. అలాంటి కోహ్లీ తప్పుకుంటే ఖచ్చితంగా ఐపీఎల్ పై ప్రభావం పడే అవకాశాలుంటాయి. మరి కోహ్లీ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్