Friday, September 12, 2025 07:04 PM
Friday, September 12, 2025 07:04 PM
roots

స్పిరిట్ నుంచి దీపిక అందుకే తప్పుకుందా..?

స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న స్పిరిట్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమా గురించి ఏ వార్త వచ్చినా ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. సినిమాలో కీలక సన్నివేశాలను కొన్నింటిని ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా షూట్ చేసినట్టు వార్తలు వచ్చాయి. యానిమల్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా.. ఈ సినిమాతో ఏ రికార్డులు బ్రేక్ చేస్తాడా అనే ఆసక్తి జనాల్లో పెరుగుతోంది. సినిమాలో నటులపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

Also Read : కడప గడపలో కదం తొక్కిన పసుపు జెండా

ముఖ్యంగా ప్రభాస్ పై అంచనాలు పెరుగుతున్నాయి. ప్రభాస్ ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ఎలివేషన్ సీన్స్ తోనే ఎక్కువగా నెట్టుకు వచ్చాడు. ఈ సినిమాలో యాక్షన్ కూడా కావాల్సి ఉంటుంది కాబట్టి.. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఇంట్రస్టింగ్ గా గమనిస్తున్నారు. అన్ని అంచనాలు ఉన్న ఈ సినిమా నుంచి హీరోయిన్ దీపికా పదుకొనే తప్పుకుంది. అసలు కారణం ఏంటీ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. ఆమె తప్పుకోవడానికి కారణాలను జాతీయ మీడియా ప్రస్తావించింది.

Also Read : ఆళ్ళకు ముహుర్తం ఖరారు అయిందా..?

డైరెక్టర్ తనకు డిజైన్ చేసిన సీన్స్ విషయంలో ఆమె అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. అలాగే తన పాత్రకు వెయిట్ ఉన్నప్పటికీ.. కొన్ని కీలక సన్నివేశాల్లో తనను తక్కువ చేసి చూపించాలనుకున్నారని, అదే విధంగా రెమ్యునరేషన్ విషయంలో కూడా తన రేంజ్ కు తగ్గట్టు మూవీ యూనిట్ ప్లాన్ చేయలేదని ఆమె అసహనం వ్యక్తం చేస్తూ తప్పుకున్నట్టు తెలుస్తోంది. అలాగే డేట్స్ విషయంలో కూడా తన ఒపినియన్ తీసుకోలేదనే కోపం కూడా ఆమె సినిమా నుంచి తప్పుకోవడానికి కారణం అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్