తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న లేకపోయినా సరే అక్కడి కార్యకర్తలు మాత్రం ఎప్పుడూ ఉత్సాహంగా పార్టీ కోసం పనిచేస్తూనే ఉంటారు. 2004 తర్వాత తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాలేదు. 20 ఏళ్లకు పైగా అధికారం లేకపోయినా సరే కార్యకర్తల్లో మాత్రం ఉత్సాహం అలాగే ఉంటుంది. టిడిపి నాయకులు ఎవరైనా వెళ్ళినా లేదంటే ఎటువంటి కార్యక్రమాలు జరిగినా సరే.. ముందు తెలంగాణ కార్యకర్తలు పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు.
Also Read : వైసీపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు..!
వేరే పార్టీల్లోకి రాజకీయ కారణాలతో వెళ్లిపోయిన సరే, చాలామంది ఇప్పటికీ టిడిపి మీద అభిమానంతోనే ఉంటారు. ఈ విషయం మరోసారి రుజువు అయింది. కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో.. తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున అభిమానుల్లో మహానాడు కార్యక్రమానికి కడప తరలి వెళ్లారు. ఉమ్మడి మెదక్, అదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, మహబూబ్నగర్ జిల్లాల కార్యకర్తలు సొంత ఖర్చులు పెట్టుకుని మహానాడు కార్యక్రమానికి హాజరు కావడం గమనార్హం.
Also Read : కడప గడపలో కదం తొక్కిన పసుపు జెండా
దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఖమ్మం, నల్గొండ జిల్లాల నుంచి సాధారణంగా టిడిపి కార్యకర్తలు ఆంధ్రలో కార్యక్రమాలకు హాజరవుతూనే ఉంటారు. కానీ ఈసారి మాత్రం.. మెదక్, అదిలాబాద్ జిల్లాల నుంచి బస్సులు ఏర్పాటు చేసుకుని కడప జిల్లాకు రావడం గమనార్హం. ఇతర రాష్ట్రాల్లో ఉన్న కార్యకర్తల సైతం ఈ కార్యక్రమానికి ఉత్సాహంగా హాజరవుతున్నారు. 2024 లో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న మహానాడు కావడంతో మరింత ఉత్సాహంగా తరలి వెళ్లారు.