తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు అత్యంత ఘనంగా ప్రారంభమైంది. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి మహానాడుని ఘనంగా నిర్వహిస్తోంది తెలుగుదేశం పార్టీ. ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు హాజరయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మూడు రోజులు ముందుగానే కడప జిల్లా చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ వచ్చారు. అటు కడప జిల్లా కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ముందుగానే.. మహానాడు జరుగుతున్న ప్రాంతానికి చేరుకుని స్వయంగా ఏర్పాట్లు చేశారు.
Also Read : నా జోలికి వస్తే తాట తీస్తా..!
విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలనుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరు కావడం విశేషం. దూరమైన సరే సొంత కార్లు లేదంటే బస్సులు ఏర్పాటు చేసుకుని కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మహిళా కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పోటీపడి కార్యక్రమానికి హాజరు కావడం గమనార్హం. దీనితో కడప జిల్లాలో హోటల్స్, గెస్ట్ హౌస్ లు నిండిపోయాయి. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరు కావడం విశేషం.
Also Read : సంక్షేమానికి కొత్త నిర్వచనం ఎన్టీఆర్..!
2019 తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనటానికి కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. 2024లో భారీ మెజారిటీతో కూటమి అధికారంలోకి రావడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం కనబడుతోంది. అది మహానాడులో స్పష్టంగా అర్థమవుతుంది. ఎంతమంది కార్యకర్తలు వచ్చినా సరే ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసింది పార్టీ అధిష్టానం. వైయస్ కుటుంబానికి కడప జిల్లా కంచుకోట. అలాంటి జిల్లాలో 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మెజారిటీ స్థానాలు గెలిచి ఊపు మీద ఉంది. దీనితో కడప జిల్లాలోని మహానాడు నిర్వహించాలని పార్టీ తీర్మానించింది. పార్టీ అంచనాలకు తగ్గట్టు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున హాజరు కావడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది.