భారత క్రికెట్ జట్టుకు కొత్త సారధి వచ్చారు. ఇప్పటి వరకు జట్టును ముందుండి నడిపించిన రోహిత్ శర్మ, కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత జట్టు సారధి ఎవరూ అనే ప్రశ్న క్రికెట్ అభిమానులను కలవరపెట్టింది. అయితే ఈ ఉత్కంఠకు బీసీసీఐ తెర దించింది. టెస్టు క్రికెట్‌కు కోహ్లీ, రోహిత్ గుడ్ బై చెప్పడంతో వారి స్థానంలో జట్టు సారధి ఎవరని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే ఈ ఎదురు చూపులకు బీసీసీఐ బ్రేక్ వేసింది. భారత క్రికెట్‌లో నవ శకం ప్రారంభమైంది. వచ్చే నెలలో ఇంగ్లండ్‌లో పర్యటించనున్న జట్టును ప్రకటించిన బీసీసీఐ.. ఈ జట్టుకు సారధిగా శుభ్ మన్ గిల్, వైఎస్ కెప్టెన్‌గా రిషబ్ పంత్‌ను ప్రకటించారు.
Also Read : కోహ్లీ బాటలోనే రోహిత్.. సంతోషంలో ఫాన్స్..!
వచ్చే నెలలో భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఈ టూర్‌లో భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. అలాగే 2027లో జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ టోర్నీకి కూడా ఇదే అర్హత సాధించే అవకాశం. ఈ టోర్నీలో గెలిచిన జట్టుకు పాయింట్ల పట్టికలో స్థానం లభిస్తుంది. దీంతో భారత్ – ఇంగ్లండ్ టెస్టు సిరీస్ పై అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రోహిత్ వారసునిగా శుభ్ మన్ గిల్ జట్టు సారధ్య బాధ్యతలు నిర్వహించనున్నారు. అలాగే రిషబ్ పంత్ వైస్ కెప్టెన్‌గా కీపర్‌గా వ్యవహరిస్తారు. మిగిలిన జట్టులో యశస్వీ జైశ్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరున్ నాయర్, నితిష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధృవ్ జురేల్, వాషింగ్టన్ సుందర్, శార్ధుల్ ఠాకూర్, జస్ప్రింత్ బూమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ఆకాష్ దీప్, అర్షదీప్ సింగ్, కుల్ దీప్ యాదవ్ ఉన్నారు.
Also Read : ఊహించని దెబ్బ కొడుతున్న ట్రంప్.. భారతీయులకు మరో షాక్
వాస్తవానికి రోహిత్ తర్వాత అంతా జట్టు కెప్టెన్‌గా బూమ్రా అవుతారని భావించారు. గతేడాది ఆస్ట్రేలియా జరిగిన పర్యటనలో రోహిత్ బదులుగా బూమ్రా కెప్టెన్‌గా వ్యవహరించారు. అందుకే అంతా బూమ్రాను ఫుల్ టైమ్ కెప్టెన్ చేస్తారని ఊహించారు. కానీ అందరి అంచనాలు తల్లకిందులు చేసిన బీసీసీఐ అనూహ్యంగా శుభ్ మన్ గిల్ పేరు ప్రకటించింది. ఇక ఈ జట్టులో గతేడాది బొర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సెంచరీతో అందరినీ ఆకట్టుకున్న తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం దక్కింది. అలాగే రిటైర్మెంట్ పుకార్లు ఎదుర్కొంటున్న జడేజాకు మరో అవకాశం దక్కింది.