Saturday, September 13, 2025 01:11 AM
Saturday, September 13, 2025 01:11 AM
roots

అన్నల సారథి ఎవరు..? రేసులో ఆ ఇద్దరు..!

కేంద్ర బలగాల దాడులతో మావోయిస్టు పార్టీ పూర్తి సంక్షోభంలో కూరుకుపోయింది. రిక్రూట్మెంట్ తగ్గిపోవడంతో పాటుగా పెద్ద ఎత్తున దళాల కాల్పుల్లో మావోయిస్టులు మృత్యువాత పడుతున్నారు. వందలాదిమంది మావోయిస్టులను కేంద్ర బలగాలు హతమారుస్తున్నాయి. వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి మావోయిస్టుల ఉనికి దేశంలో ఉండకూడదని కేంద్ర ప్రభుత్వం పట్టుదలగా ముందుకు వెళుతోంది. దీనితో మావోయిస్టులు మనుగడ పోరాటం చేస్తున్నారు. ఇటీవల మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల్ల కేశవరావును భద్రత బలగాలు హతమార్చాయి.

Also Read : హరీష్ రావుకే కవిత మద్దతు..? లేఖ ఉద్దేశం ఇదేనా..?

దీనితో కొత్త నాయకుడు ఎవరు అనేదానిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ప్రస్తుతం రెండు పేర్లు ప్రధానంగా వినపడుతున్నాయి. మావోయిస్టు పార్టీలో మిలటరీ విభాగానికి నాయకత్వం వహిస్తున్న సీనియర్ నేత తిప్పిరి తిరుపతి పేరు ప్రధానంగా వినపడుతోంది. తిరుపతికి ప్రస్తుతం 62 ఏళ్లు. దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో.. ఆయన సారధ్య బాధ్యతలు చేపడితే గిరిజనులతో పాటుగా దళితులను పార్టీ వైపు తీసుకు రాగలరు అనే నమ్మకంలో పార్టీ నాయకత్వం ఉన్నట్లు సమాచారం.

Also Read : భయం భయంగా బెజవాడ.. మళ్ళీ ఎందుకీ అలజడి..?

ఇక పార్టీ సైద్ధాంతిక విభాగానికి నాయకత్వం వహిస్తున్న.. మల్లోజుల వేణుగోపాలరావు పేరు కూడా ప్రముఖంగా వినపడుతోంది. మాజీ మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు సోదరుడు మల్లోజుల వేణుగోపాలరావు. 2011లో కోటేశ్వరరావు ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత వేణుగోపాలరావు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే సీనియర్ నేతలు మాత్రం వేణుగోపాలరావుకు పార్టీ బాధ్యతలు అప్పగించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన వయసు 70 ఏళ్ళు. దానికి తోడు అగ్రకులానికి చెందిన వ్యక్తి కావడంతో.. అది మావోయిస్టు పార్టీ బలోపేతానికి ఇబ్బందికరంగా మారుతుందని కొంతమంది అభిప్రాయపడుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే కేశవరావు మృతిపై ఇంకా పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడ లేదు. దీనితో తమ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎవరు అనేదానిపై ఇంకా మావోయిస్టుల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటనలు రావడం లేదు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్