Friday, September 12, 2025 07:11 PM
Friday, September 12, 2025 07:11 PM
roots

ఐఎస్ఐ ఎలా పని చేస్తుంది..? పాక్ గూడచారి సంస్థ సంచలన విషయాలు

భారత్ లో కుట్రల విషయంలో.. పాక్ గూడచారి సంస్థ ఐఎస్ఐ పాత్ర ఎక్కువ. ఆ దేశ ఆర్మీ, ఉగ్రవాదులతో కలిసి ఐఎస్ఐ దాడులకు పాల్పడుతూ ఉంటుంది. దేశంలో జరిగే అనేక దాడులకు ఈ సంస్థనే కారణం. పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు సమకూర్చుకోవడం, ఆర్మీ, ఉగ్రవాదుల సహకారంతో సరిహద్దుల్లో అలజడి సృష్టించడం వంటి చర్యలకు పాల్పడుతోంది. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో 26 మంది పౌరులను కాల్చి చంపిన తర్వాత మరోసారి ఈ సంస్థ పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగింది.

Also Read : కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మళ్ళీ వైట్ జెర్సీలో..?

రెసిస్టెన్స్ ఫ్రంట్ దీనికి బాధ్యత వహించినా ఎక్కువగా వినపడిన పేరు మాత్రం ఐఎస్ఐ. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా సహా పలు ఉగ్రవాద సంస్థలకు నిధులు అందిస్తోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత 2019లో రెసిస్టెన్స్ ఫ్రంట్ కు ఐఎస్ఐ ప్రాణం పోసింది. ఈ పాకిస్తాన్ ప్రధాన గూఢచారి సంస్థను జనవరి 1, 1948న అప్పటి పాకిస్తాన్ సైన్యం డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ వాల్టర్ కాథోర్న్ ఏర్పాటు చేసారు. ఆ తర్వాత పలు యుద్దాల్లో కీలకంగా వ్యవహరించింది ఈ సంస్థ.

Also Read : టార్గెట్ భారత్ ఏజెంట్లు.. జ్యోతి విచారణలో సంచలనాలు

1947 మొదటి కాశ్మీర్ యుద్ధంలో.. సైన్యం, నావికాదళం, వైమానిక దళం మధ్య నిఘా, సమన్వయాన్ని అప్పుడు ఆర్మీ ఉన్నతాధికారులు బహిర్గతం చేసారు. ఆ తర్వాత ఈ సంస్థను ఏర్పాటు చేసారు. ఇస్లామాబాద్‌లో ప్రధాన కార్యాలయం ఉండగా.. అంతర్గత విభాగం దేశీయ నిఘా, దేశీయ ప్రతి-నిఘా, ప్రతి-గూఢచర్యం మరియు ఉగ్రవాద నిరోధక బాధ్యతలను నిర్వహిస్తుంది. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. విదేశీ, దౌత్య వ్యవహారాలు, దేశ అంతర్గత వ్యవహారాలు, నిఘా విభాగాలు ఉంటాయి. ప్రతి విభాగాన్ని డైరెక్టరేట్‌లుగా విభజించారు.

Also Read : పవన్ ప్లానింగ్ అదుర్స్.. త్వరలో మరో కార్యక్రమం

మొత్తం 12 డైరెక్టరేట్‌లు ఉన్నాయి. ప్రతిదానికీ మేజర్ జనరల్ హోదా కలిగిన డైరెక్టర్ జనరల్ నేతృత్వం వహిస్తారు. ఈ డైరెక్టరేట్లలో కోవర్ట్ యాక్షన్ డివిజన్, జాయింట్ ఇంటెలిజెన్స్ ఎక్స్, జాయింట్ ఇంటెలిజెన్స్ బ్యూరో, జాయింట్ కౌంటర్ ఇంటెలిజెన్స్ బ్యూరో, జాయింట్ ఇంటెలిజెన్స్ టెక్నికల్, ఎస్ఎస్ డైరెక్టరేట్, పొలిటికల్ ఇంటర్నల్ డివిజన్ వంటి విభాగాలు ఉంటాయి. తన క్యాడర్ ను సాయుధ దళాల నుండి, సాధారణ పౌరుల నుంచి తీసుకుంటుంది. ఫెడరల్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ గూఢచారి సంస్థ కోసం పౌరులను నియమిస్తుంది. హిజ్బుల్ ముజాహిదీన్, అల్-బదర్, అల్-ఖైదా, హర్కత్-ఉల్-ముజాహిదీన్, హక్కానీ నెట్‌వర్క్, లష్కరే-ఎ-తైబా, జైష్-ఎ-మహమ్మద్, ది రెసిస్టెన్స్ ఫ్రంట్, తెహ్రీక్-ఉల్-ముజాహిదీన్, పాకిస్తాన్, సిపాహా- లష్కరే-జాంగ్వీ, అన్సార్-ఉల్-లస్లామ్ వంటి ఉగ్రవాద సంస్థలతో కలిసి పని చేస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్