Friday, September 12, 2025 10:59 PM
Friday, September 12, 2025 10:59 PM
roots

జిమ్ అయిపోయాక సిగరెట్ కాలుస్తున్నారా..?

“కర్ణాటకలో వివాహ వేడుకలో గుండెపోటుతో 25 ఏళ్ల వ్యక్తి మృతి
“జిమ్ వ్యాయామం చేస్తున్నప్పుడు గుండెపోటుతో 28 ఏళ్ల బాడీబిల్డర్ మృతి”
“మారథాన్ పరుగు అనంతరం గుండెపోటుతో 29 ఏళ్ల డెంటల్ సర్జన్ మృతి”
” 38 ఏళ్ల జిమ్ ట్రైనర్ గుండెపోటుతో మృతి”

ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్న వార్తలు. గుండెపోటు అనేది ఓ సాధారణ విషయంగా మారిపోయి ప్రాణాలను హరిస్తోంది. అయితే గుండెపోటు రాకుండా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు అని వైద్యులు చెప్తున్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ కేసుల్లో చాలా వరకు బాధితులు ఎక్కువగా 40 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న వారే. కరోనా తర్వాత ఈ కేసులు ఎక్కువగా పెరిగాయి. నిపుణుల అధ్యయనం ప్రకారం.. కరోనా ఒకటే గుండెపోటుకు కారణం కాదని అంటున్నారు.

Also Read : ఐఎస్ఐ ఏజెంట్ల నిలయంగా నార్త్ ఇండియా

గుండెపోటుకు ఎక్కువగా కారణాలను బయటపెట్టారు. డ్రగ్స్ అలవాటు, జిమ్ వర్కౌట్స్ మధ్య.. సిగరెట్స్ కాల్చడం వంటి వాటితో పాటుగా.. మద్యపానం వారి ప్రాణాలను హరిస్తోందని హెచ్చరిస్తున్నారు. ముందుగా, ఫిట్‌గా కనపడటానికి ఆరోగ్యానికి సంబంధం లేదంటున్నారు నిపుణులు. నిద్ర లేకపోవడంతో పాటుగా రాత్రి సమయాల్లో నిద్ర లేకుండా జిమ్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం ప్రాణాలు తీస్తోంది అంటున్నారు నిపుణులు. చాలా మంది 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారని ఇది అసలు మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.

Also Read : అక్కడికి రాహుల్ వచ్చేస్తున్నాడు..? బెర్త్ ఖరారు

దీని కారణంగా మానసిక ఒత్తిడితో పాటుగా శరీరంలో ఎక్కువగా కెఫీన్ విడుదల అవుతుందని హెచ్చరిస్తున్నారు. అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్ కూడా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. హై బీపీ ఉన్న వారు జిమ్ చేసే విషయంలో జాగ్రత్తగా లేకపోతే అనవసర సమస్యలు వస్తాయని, కాబట్టి దీని మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. రెస్టారెంట్ ఫుడ్ మీద ఆధారపడటం తగ్గించాలని, జిమ్ చేసే వారు లేట్ నైట్ పార్టీల మీద ఎక్కువగా టైం వేస్ట్ చేస్తున్నారని, ఇది నిద్రను దూరం చేస్తుందని హెచ్చరిస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్