ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం వ్యవహారం వైసిపి నేతలపై క్రమంగా ఒత్తిడి పెంచుతోంది. ఆ పార్టీ అగ్ర నాయకత్వం ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన నేపథ్యంలో ఎప్పుడు ఎవరిని దర్యాప్తు అధికారులు విచారణకు పిలుస్తారు అనేది ఆసక్తిని రేపుతోంది.. తాజాగా జగన్ మాజీ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డిని అలాగే ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డిని దర్యాప్తు అధికారులు అరెస్టు చేసిన తర్వాత ప్రజల్లో మరింత ఆసక్తి పెరిగిపోయింది. దీనిపై సోషల్ మీడియాతో పాటుగా ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
Also Read : వైసీపీని షేక్ చేస్తున్న లోకేష్ ఢిల్లీ టూర్.. సడన్ టూర్ అందుకేనా..?
వైసిపి అగ్రనాయకత్వాన్ని తర్వాత విచారణకు పిలిచే అవకాశాలు ఉండొచ్చు అంటూ కొంత ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంచితే లిక్కర్ కుంభకోణం వ్యవహారంలో వైసిపి సోషల్ మీడియా సైలెంట్ అయిపోయింది.. ఈ వ్యవహారాన్ని ముందు తక్కువ అంచనా వేసిన వైసిపి సోషల్ మీడియా ఆ తర్వాత కాస్త హడావిడి చేసిన ఇప్పుడు మాత్రం.. ఏ అరెస్టు జరుగుతున్న సరే దాని గురించి స్పందించేందుకు ఆసక్తి చూపించడం లేదు. వైసీపీలో కూడా ఒకరిద్దరు నాయకులు మినహా దీని గురించి పెద్దగా మాట్లాడేందుకు ముందుకు రావడం లేదు.
Also Read : బాబోయ్ జగన్.. ఇదేం లాజిక్కు..!
ప్రజా ప్రతినిధులు గాని రాజ్యసభ ఎంపీలు గాని ఎవరు దీనిపై మీడియా సమావేశాలు సైతం ఏర్పాటు చేయడం లేదు. కృష్ణమోహన్ రెడ్డిని అరెస్టు చేశారు అంటే తర్వాత టార్గెట్ వైఎస్ జగన్ అనేది స్పష్టంగా అర్థం అవుతుంది. కాబట్టి ఈ సమయంలో వైసీపీ నాయకత్వం జగన్ కు అండగా నిలబడాల్సిన పరిస్థితి. అయినా సరే సోషల్ మీడియాతో పాటుగా నాయకత్వం కూడా సైలెంట్ గా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అరెస్టు తర్వాత వైసిపి నాయకత్వంలో కాస్త కంగారు మొదలైంది. మరి భవిష్యత్తులోనైనా ఈ వ్యవహారంలో ఆ పార్టీ అధిష్టానానికి అండగా నిలుస్తారా లేదా అనేది చూడాలి.