ఇప్పుడు తెలంగాణలో ఒకటే టాపిక్ నడుస్తోంది. అదే మిస్ వరల్డ్ పోటీలు. ప్రస్తుతం ప్రపంచ సుందరీమణులంతా తెలంగాణలోనే పర్యటిస్తున్నారు. మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ ఆతిధ్యం ఇస్తోంది. తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా రేవంత్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. పోటీల్లో భాగంగా పలు ప్రాంతాల్లో అందాల భామలు పర్యటిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపట్టింది. అయితే ఈ పోటీల నిర్వహణపై ఇప్పుడు రేవంత్ ప్రభుత్వాన్ని విపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి. అసలు ఈ ఈవెంట్ చేయాల్సిన అవసరం ఏమిటంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి కూడా. ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌కు చెందిన నేత కేటీఆర్ అయితే మరో అడుగు ముందుకు వేశారు కూడా.
Also Read : పథకాల అమలు పై ఫుల్ క్లారిటీ..!
మిస్ వరల్డ్ పోటీలకు ఆతిధ్యం ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. వాస్తవానికి ఇలాంటి ఈవెంట్ కోసం బెంగళూరు, చెన్నై, ముంబై వంటి మహానగరాలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాయి. కానీ ఇవేవి కాదని.. అన్ని విధాలుగా సురక్షితమైన ప్రదేశంగా హైదరాబాద్‌ను ఈవెంట్ నిర్వాహకులు ఎన్నుకున్నారు. ఓ వైపు భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నా కూడా ఆ ప్రభావం మిస్ వరల్డ్ పోటీలపై లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు నిర్వాహకులు. ఇక రేవంత్ సర్కార్ కూడా ఇందుకు అన్ని విధాలుగా నిర్వాహకులకు సహకరిస్తోంది.
Also Read : ముఖ్యమంత్రి పీ4 ఆదర్శంగా.. గొట్టిపాటి అడుగులు..!
ఇక మిస్ వరల్డ్ పోటీల కోసం వచ్చిన అందాల భామలు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. యాదాద్రి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భూదాన్ పోచంపల్లిలో చేనేత వస్త్రా లను పరిశీలించారు. చారిత్రాత్మక కట్టడం రామప్ప దేవాలయంలో శిల్ప కళకు మంత్ర ముగ్ధులు అయ్యారు. చార్మినార్ కట్టడం ఎదురుగా రాంప్ వాక్ చేశారు. వీటన్నిటికీ ప్రపంచస్థాయిలో పబ్లిసిటీ వచ్చేసింది. దీని ద్వారా పర్యాటకుల సంఖ్య బాగా పెరుగుతుందని రేవంత్ సర్కార్ భావిస్తోంది. తెలంగాణకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని కూడా ఇప్పటికే పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read : నేతల రాజీనామాల వెనుక కారణమదే..!
అయితే మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల దుస్థితి కంటే కూడా అందాల పోటీల నిర్వహణే ముఖ్యమంటూ కామెంట్ చేశారు. అలాగే అందాల పోటీల కోసం పేదల ఇళ్లు కూల్చేస్తున్నారంటూ గగ్గొలు పెట్టారు. అయితే వీటికి కాంగ్రెస్ నేతలు, నెటిజన్లు ఘాటుగా బదులిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో హైదరాబాద్‌లో నాలుగేళ్ల పాటు ఫార్ములా ఈ రేస్ నిర్వహించేందుకు ఎఫ్ఈవో, ఎస్ నెక్ట్స్‌జెన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రైవేటు సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. సుమారు రూ.100 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఇందుకోసం రూ.55 కోట్లను ఎఫ్ఈవో సంస్థకు హెచ్‌ఎండీఏ చెల్లించింది కూడా. ఇందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు గుర్తించిన రేవంత్ సర్కార్.. ఏసీబీ విచారణకు ఆదేశించింది కూడా. దీంతో ఫార్ములా ఈ రేస్ పూర్తిగా రద్దైంది.
Also Read : లోపలికి వెళ్లాలంటే పర్మిషన్ ఉండాల్సిందే..!
కేసీఆర్ ప్రభుత్వం ఫార్ములా ఈ రేస్ ఒప్పందం చేసుకున్న సమయంలోనే హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వస్తుందని నాటి మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆ వీడియోను బయటపెడుతున్న నెటిజన్లు.. అవినీతిలో నిజంగానే హైదరాబాద్‌కు గుర్తింపు తీసుకువచ్చారంటూ ఎద్దేవా చేస్తున్నారు. మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ ఆతిధ్యం ఇస్తోందని.. దీని వల్ల ప్రపంచంలోని అన్ని దేశాల ప్రతినిధులు, పర్యాటకులు కూడా తెలంగాణకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.