టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ కు ప్రమోషన్ రానుందా..? అంటే అవుననే అంటున్నాయి.. టిడిపి వర్గాలు. 2010 తర్వాత రాజకీయాల్లో యాక్టివ్ అయిన నారా లోకేష్.. టిడిపి లో క్షేత్రస్థాయి బలోపేతానికి అప్పటినుంచి కష్టపడుతూ వస్తున్నారు. 2014 తర్వాత క్యాబినెట్లో అడుగుపెట్టిన ఆయన 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఓటమిపాలైనా.. ఆ తర్వాత అదే నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించి రికార్డు సృష్టించారు.
Also Read : అంగరంగ వైభవంగా పసుపు పండుగ..!
దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తెలుగుదేశం పార్టీ అక్కడ విజయం సాధించింది. ఇక ప్రభుత్వంలో కూడా లోకేష్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఐటీ, విద్యాశాఖ మంత్రిగా ఆయన.. తన శాఖలను సమర్థవంతంగా నడిపిస్తున్నారు. క్రమంగా పరిపాలనపై కూడా లోకేష్ పట్టు పెంచుకుంటున్నారు. దీనితో టిడిపిలో ఆయనకు ప్రమోషన్ ఇచ్చేందుకు పార్టీ అగ్రనాయకత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై టిడిపి సీనియర్ నేతలు కూడా సముఖంగానే ఉన్నారని వార్తలు వస్తున్నాయి.
Also Read : పెద్దిరెడ్డి టార్గెట్ గా పవన్ సంచలన అడుగులు
భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని లోకేష్ కు ప్రమోషన్ ఇస్తే బాగుంటుందనే భావనలో టిడిపి నాయకత్వం ఉంది. ఎలాగో పార్టీకి భవిష్యత్తు నాయకుడు లోకేష్ కాబట్టి.. ఆయనకు ప్రమోషన్ ఇచ్చే అంశంలో పార్టీ నేతలు అందరూ ఏకతాటి మీద ఉన్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. లోకేష్ ను పార్టీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా.. మహానాడులో ప్రకటించే అవకాశాలు కనపడుతున్నాయి. దీనికి సంబంధించి పాలిట్ బ్యూరో సమావేశం అయిన తర్వాత టిడిపి నాయకత్వంతో చంద్రబాబు నాయుడు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి చంద్రబాబు పార్టీ నేతల వద్ద ప్రస్తావించగా.. నాయకత్వం కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.