భారత్ – పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న యుద్ద వాతావరణంలో అమెరికా జోక్యం చేసుకోవడం ఆశ్చర్యం కలిగించింది. రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ చేసిన ప్రకటనతో అందరూ కంగుతిన్నారు. ఇక దీనిపై భారత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనితో మోడీ సర్కార్ నష్ట నివారణ చర్యలకు దిగింది. 26 మందిని బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత, నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) మరియు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఓకె) లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై భారత్ దాడులు చేసింది.
Also Read : టిబెటన్ పీఠభూమిపై విమానాలు ఎందుకు ఎగరలేవు?
ఆ తర్వాత పాకిస్తాన్ సైన్యం కూడా కాల్పులు జరుపుతూ వచ్చింది. ఈ సమయంలో గత వారాంతంలో భారత్ -పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని పోస్ట్ చేయడం, దీనిపై అమెరికా విదేశాంగ శాఖ అధికారులు ప్రకటనలు చేయడం సంచలనం అయింది. దీనిపై మోడీ సర్కార్ తాజాగా పలు వివరణలు ఇచ్చింది. రెండు దేశాల డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మధ్య సైనిక మార్గాల ద్వారా నేరుగా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
Also Read : ఆందోళనకరంగా వంశీ ఆరోగ్యం..?
ఆపరేషన్ సిందూర్ సమయంలో అమెరికాతో వాణిజ్యంపై ఎటువంటి చర్చ జరగలేదని పేర్కొంది. రెండు దేశాల సరిహద్దు సమస్యలను పరిష్కరించేందుకు ట్రంప్ మధ్యవర్తిత్వం అవసరం లేదని, ఈ విషయంలో తాము ముందు నుంచి ఒకే విధానంతో ఉన్నామని పేర్కొంది. సరిహద్దు సమస్యపై తటస్థ వేదికపై చర్చ జరిపేందుకు రెండు దేశాలు అంగీకరించాయని అమెరికా విదేశాంగ కార్యదర్శి చేసిన ప్రకటనను కూడా భారత్ తప్పుబట్టింది. ఉగ్రవాదం విషయంలో భారత్ వైఖరి స్పష్టంగా ప్రపంచానికి అర్ధమైందని, ఎటువంటి అపోహలు వద్దని వివరణ ఇచ్చింది.