టీం ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ.. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత అతని గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అంతర్జాతీయ మీడియా కూడా కోహ్లీపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. సోషల్ మీడియాలో ప్రముఖులు కూడా అతని రిటర్మెంట్ పై రియాక్ట్ అయ్యారు. గత 16 ఏళ్ళ నుంచి ప్రపంచ క్రికెట్ లో కోహ్లీ పేరు ప్రముఖంగా వినపడుతోంది. అతని బ్రాండ్ వాల్యూ కూడా భారీగా పెరుగుతూ వస్తోంది. దీనితో పాటుగా కోహ్లీ వ్యాపారాలు కూడా విస్తరిస్తూ వచ్చాడు.
Also Read : ఇదీ కింగ్ బ్రాండ్.. హోరెత్తుతున్న సోషల్ మీడియా
అతని ఆస్తుల విలువ కూడా భారీగానే ఉంటుంది. పలు నివేదికల ప్రకారం అతని ఆస్తుల విలువ… రూ. 1,050 కోట్లు అని తెలుస్తోంది. దీనితో కోహ్లీ ప్రపంచంలోని అత్యంత ధనిక అథ్లెట్లలో ఒకడిగా నిలిచాడు. అతని బ్రాండ్ వాల్యూ, క్రికెట్ ఆడటం, పలు కంపెనీలకు ప్రచారకర్తగా కూడా కోహ్లీ వ్యవహరిస్తున్నాడు. దీనితోనే ఆస్తులు వెయ్యి కోట్లు దాటాయి. అతని భార్య, బాలీవుడ్ నటి.. అనుష్క శర్మ ఆస్తులు కూడా భారీగానే ఉన్నాయి. ఈ జంట ఆస్తులు మొత్తం.. రూ. 1,250 కోట్ల నుంచి 1300 కోట్ల వరకు ఉండవచ్చని భావిస్తున్నారు.
Also Read : విదేశీ బోర్డులపై బీసీసిఐ ఒత్తిడి..? ఐపిఎల్ కోసం బోర్డు సాహసం..?
భారత క్రికెట్ నియంత్రణ మండలి సెంట్రల్ కాంట్రాక్ట్ గ్రేడ్ A+. దీనితో కోహ్లీకి 7 కోట్ల రూపాయలు బోర్డు నుంచి ప్రతీ ఏటా చెల్లిస్తూ ఉంటారు. ప్రతి వన్డే మ్యాచ్ కు ఆరు లక్షల వరకు తీసుకుంటాడు కోహ్లీ. టి 20 మ్యాచ్ కు.. రూ. 3 లక్షలు తీసుకుంటాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో, కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ప్రతి సీజన్ కు రూ. 15 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. కోహ్లీ దగ్గర ఆడి, బెంట్లీ, మెర్సిడెస్-బెంజ్ వంటి టాప్-ఎండ్ మోడల్స్‌తో సహా లగ్జరీ కార్లు ఉన్నాయి.