Friday, September 12, 2025 02:52 PM
Friday, September 12, 2025 02:52 PM
roots

ఏపీ లిక్కర్ స్కాం.. ఆధారాలన్నీ హైదరాబాద్ లోనే..?

ఆంధ్రప్రదేశ్ లో మద్యం కుంభకోణంలో ఏ అరెస్ట్ లు ఉంటాయా అంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వర్గాలతో పాటుగా సాధారణ ప్రజలు కూడా ఎదురు చూస్తూ వస్తున్నారు. ఈ విషయంలో మాజీ సిఎం వైఎస్ జగన్ లక్ష్యంగా దర్యాప్తు ముందుకు వెళ్తున్న విషయం స్పష్టంగా అర్ధమవుతోంది. ఇటీవల కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత.. తర్వాతి పెద్ద తలకాయ్ ఎవరూ అనేది ఆసక్తి పెరిగింది. ఈ వ్యవహారంలో ఉన్న కొందరిని క్రమంగా అదుపులోకి తీసుకుంటూ వచ్చారు.

Also Read : బ్రేకింగ్: ఏపీ లిక్కర్ స్కాంలో షేకింగ్ న్యూస్

ఇక తాజాగా వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి వ్యాపార వ్యవహారాల్లో కీలకంగా ఉన్న బాలాజీ గోవిందప్పను పోలీసులు మైసూరులో అదుపులోకి తీసుకున్నారు. దీనితో ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డిలపై గురిపెట్టడం ఖాయమని అందరూ భావిస్తున్నారు. ఇక బాలాజీ గోవిందప్పను అరెస్ట్ చేసిన తర్వాత హైదరాబాద్ పైనే ఎక్కువగా గురిపెట్టి.. అధికారులు విచారణను ముందుకు నడుపుతున్నారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో హైదరాబాద్‌లో సిట్ సోదాలు మంగళవారం సాయంత్రం హాట్ టాపిక్ గా మారాయి.

Also Read : స్కాంలో లేము.. కేసిరెడ్డి టు కృష్ణమోహన్ రెడ్డి.. ఎవరిని ఇరికిస్తున్నట్టు..?

హైదరాబాద్‌లో 5 చోట్ల సోదాలు చేసారు సిట్ అధికారులు. షేక్‌పేట్, మెహదీపట్నం, రాజేంద్రనగర్, గుడిమల్కాపూర్, యాకుత్‌పురాలో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని 5 కంపెనీల డైరెక్టర్ల నివాసాల్లో సిట్ అధికారులు సోదాలు చేసారు. నాటికల్ గ్రీన్ ఎనర్జీ డైరెక్టర్లు రోహిత్‌రెడ్డి, సావిరెడ్డి, శ్రీలత ఇళ్లలో సోదాలు చేసారు. ఇబోట్ ఎనర్జీ సిస్టమ్స్ డైరెక్టర్లుగా ఉన్న రవికుమార్, శ్రీలత, రోహిత్‌రెడ్డి.. ఈ వ్యవహారంలో కీలకంగా ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. స్కూబి ల్యాబ్స్ రోబోటిక్స్ డైరెక్టర్లుగా నితిన్‌కృష్ణ, రూపక్ జాడ, రోహిత్‌రెడ్డి.. ఏపీ మద్యం వ్యవహారంలో ముందు నుంచి కీలకంగా పావులు కదిపినట్టు భావిస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్