ఆపరేషన్ సిందూర్ లో భాగంగా బుధవారం తెల్లవారుజామున భారత బలగాలు జరిపిన దాడికి సంబంధించి జాతీయ మీడియా పలు ఆసక్తికర ఫోటోలు బయటపెట్టింది. శాటిలైట్ ఫోటోలను రిలీజ్ చేసి భారత ఆర్మీ ఎంత పక్కాగా దాడికి దిగిందో వివరించింది. భారత వైమానిక బలగాలు.. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిక్షణా శిబిరాలు, రిక్రూట్మెంట్ సెంటర్ లను లక్ష్యంగా చేసుకుని దాడి చేసాయి. ముఖ్యంగా జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం) నడుపుతున్న.. సెంటర్ ను లక్ష్యంగా చేసుకుని దాడికి దిగాయి.
Also Read : ఆపరేషన్ సిందూర్ అని ఎందుకు పెట్టారు..?
దాడులు జరిగిన కొన్ని గంటలకే తీసిన ఈ చిత్రాలు.. మన ఆర్మీ ఏ స్థాయిలో పక్కా సమాచారంతో దాడికి దిగిందో బయటపెట్టాయి. పాకిస్తాన్, పంజాబ్‌లోని బహవల్‌పూర్‌లోని జెఎం ప్రధాన శిక్షణా కేంద్రం మర్కజ్ సుభాన్ అల్లా వద్ద, ఒక మెగా మసీదు యొక్క మూడు గోపురాలు ఈ దాడుల్లో ధ్వంసమయ్యాయి. మరో రెండు చెక్కుచెదరకుండా ఉన్నాయి. అదే భవనంలో 2,100 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న భవనాలు.. దాడుల దెబ్బకు శిథిలావస్థకు చేరుకున్నట్లు అమెరికన్ ఎర్త్ ఇమేజింగ్ సంస్థ మాక్సర్ టెక్నాలజీస్ అందించిన చిత్రాలలో స్పష్టంగా అర్ధమైంది.
Also Read : Operation Sindoor: ఎవరీ కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్
మర్కజ్ సుభాన్ అల్లాహ్ పై జరిగిన దాడులలో HAMMER (హైలీ ఏజిల్ మాడ్యులర్ మ్యూనిషన్ ఎక్స్‌టెండెడ్ రేంజ్) స్మార్ట్ బాంబులు, SCALP క్షిపణులను ఉపయోగించారని జాతీయ మీడియా వెల్లడించింది. HAMMER అనేది 70 కిలోమీటర్ల వరకు లక్ష్యాలను ఛేదించగల ప్రెసిషన్-గైడెడ్ మ్యూనిషన్ అయితే, SCALP అనేది 250 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధి కలిగిన దీర్ఘ-శ్రేణి, క్రూయిజ్ క్షిపణి. దీన్ని గాల్లోనే ప్రయోగించవచ్చు. 15 ఎకరాలలో విస్తరించి ఉన్న మర్కజ్ సుభాన్ అల్లాహ్ లో ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇస్తున్నారు. పంజాబ్‌లోని మురిడ్కేలోని మర్కజ్ తైబా అనే లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) ప్రధాన కార్యాలయంలోని భవనం కూడా భారీగా దెబ్బతిన్నట్లు స్పష్టంగా అర్ధమైంది. 82 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ కేంద్రంలో ఆయుధ శిక్షణ ఇస్తారు.
