రాజకీయాల్లోకి వచ్చిందే తొలిసారి. గెలుపు కూడా అలా ఇలా కాదు.. ప్రచారంలో చెప్పినట్లుగానే ప్రమాణ స్వీకారం చేసి చూపించారు. అంతటితో ఆగలేదు.. ఆ తర్వాత తన పని తీరు ఎలా ఉంటుందో మాటల్లో కాకుండా.. చేతల్లో చూపిస్తున్నారు. పెద్ద పదవిలో ఉన్నా సరే.. సామాన్యులకు కూడా అందుబాటులో ఉంటున్నారు. ఎవరైనా సరే.. సాయం కావాలని వస్తే.. చేతికి ఎముక లేనట్లుగా సాయం అందిస్తున్నారు. అటు రాష్ట్రానికి, తన సొంత నియోజకవర్గానికి తన వంతు సాయం అందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా.. ఎవరో కాదు.. డా.పెమ్మసాని చంద్రశేఖర్. పోటీ చేసిన తొలిసారే ఘన విజయం సాధించారు. అనూహ్యంగా కేంద్ర మంత్రి పదవి కూడా రావడంతో.. తన మార్కు పనితీరుతో అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు పెమ్మసాని.
Also Read : కావలి మాజీ ఎమ్మెల్యేకి మూడిందా..?
గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం తరఫున తొలిసారి టీడీపీ అభ్యర్థిగా డా.పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేశారు. ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన పెమ్మసాని.. డాక్టర్ పట్టా పుచ్చుకోవడంతో పాటు.. అమెరికాలో స్థిరపడ్డారు. వేల కోట్లు సంపాదించినప్పటికీ.. తన సొంత ప్రాంతాన్ని మాత్రం ఏ రోజు మర్చిపోలేదు. ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా గుంటూరు జిల్లాకు తనకు తోచిన సాయం అందిస్తూనే ఉన్నారు. అయితే అనూహ్యంగా ఎన్నికల్లోకి వచ్చిన పెమ్మసాని.. 2024 ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. వైసీపీ నేతలు ఎన్ని మాటలన్నా… ఎన్ని కుయుక్తులు పన్నినా సరే.. సైలెంట్‌గా తన పని చేసుకుంటూ.. ఎన్నికల్లో ఓటర్లకు చేరువయ్యారు. ముందుగా గుంటూరు పార్లమెంట్ పరిధిలో సమస్యలను గుర్తించారు. వాటి శాశ్వత పరిష్కారానికి చేపట్టాల్సిన పనులపై ప్రజలకు హామీ ఇచ్చారు. తనపై నమ్మకం ఉంటేనే ఓటు వేయాలని కోరారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఆ తర్వాత నుంచి మరింత బాధ్యతగా పని చేస్తున్నారు.
Also Read : అమరావతిపై ద్వేషం.. వైసీపీని మించిన బీఆర్ఎస్
గుంటూరు పార్లమెంట్ పరిధిలోనే కాకుండా ఏపీ అభివృద్ధికి తన వంతు సాయం అందిస్తున్నారు. ముందుగా రాజధాని నిర్మాణానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం కృషి చేశారు. అలాగే మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించారు. ఎన్నికల్లో చెప్పినట్లుగానే గుంటూరు నగరంలో ట్రాఫిక్ చిక్కులకు చెక్ పెట్టేందుకు ఇప్పుడు భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. గుంటూరు నగరంలో రైల్వే స్టేషన్ సమీపంలోని ఏసీ కాలేజ్ – శంకర్ విలాస్ హోటల్ మధ్య రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించి ఇప్పటికే 30 ఏళ్లు దాటిపోయింది. ఇప్పుడు ట్రాఫిక్ రద్దీ పెరిగిపోవడంతో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో ప్రజలు నరకం చూస్తున్నారు. అటు ఏసీ కాలేజ్ వైపు విద్యా సంస్థలు, ఆసుపత్రులు ఉన్నాయి. ఇటు శంకర్ విలాస్ వైపు అన్ని రకాల వ్యాపారాలు జరుగుతున్నాయి. దీంతో కొత్త ఆర్‌వోబీ నిర్మించాలని స్థానికులు ఎప్పటి నుంచే డిమాండ్ చేస్తున్నారు.
Also Read : కూటమి సర్కారుపై జగన్ ముఠా మరో కొత్త వ్యూహం..!
దీనికి పెమ్మసాని శాశ్వత పరిష్కారం చూపించారు. గుంటూరు నగరంలో రూ.98 కోట్ల వ్యయంతో మరో ఆర్‌వోబీ నిర్మించనున్నారు. ఎన్నికల్లో చెప్పినట్లే ఏడాది లోపే ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపించారు. ఏసీ కాలేజీ వద్ద ఈ బ్రిడ్జ్ పనులకు శంకుస్థాపన చేశారు. రెండేళ్లల్లో బ్రిడ్జి పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. అదే సమయంలో రెండేళ్ల పాటు ట్రాఫిక్ సమస్యలను ప్రజలు అర్థం చేసుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు కూడా. రాజకీయాలకు కొత్త అయినప్పటికీ.. అందరినీ కలుపుకుంటూ ముందుకు పోతున్నారు పెమ్మసాని. నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రం అభివృద్ధిలో అందరినీ భాగస్వామ్యులను చేస్తున్నారు. అదే సమయంలో ఏడాది పాటు కేంద్ర మంత్రి బాధ్యతలను సమగ్రంగా నిర్వహించిన పెమ్మసానిపై కనీసం ఒక్కటంటే ఒక్క ఆరోపణ కూడా లేదు. దీంతో అంతా శభాష్ పెమ్మసాని అని కితాబిస్తున్నారు.