Friday, September 12, 2025 03:26 PM
Friday, September 12, 2025 03:26 PM
roots

లిక్కర్ స్కామ్.. భారతీ అరెస్టు తప్పదా..?

ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై సీఐడీ ముమ్మర దర్యాప్తు జరుపుతోంది. ఈ కేసులో ఇప్పటికే రాజ్ కేసిరెడ్డితో పాటు పలువురిని అరెస్టు కూడా చేసింది. విచారణలో వీరు ఇచ్చిన సమాచారం ఆధారంగా గత ప్రభుత్వంలో సీఎం జగన్ దగ్గర సీఎంవోలో పనిచేసిన అధికారుల్ని అరెస్టు చేసేందుకు సీఐడీ సిద్ధమవుతోంది.

Also Read : మళ్లీ కుంటి సాకులు చెబుతున్న జగన్..!

జగన్ ఓఎస్టీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, సీఎంవో కార్యదర్శిగా పనిచేసిన ధనుంజయ్ రెడ్డితో పాటు స్కాంలో ప్రమేయం ఉన్న బాలాజీ గోవిందప్ప లిక్కర్ స్కాంలో అరెస్టు కాకుండా తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు.. ప్రభుత్వ అభిప్రాయం కోరింది. దీంతో పీపీ ప్రభుత్వ అభిప్రాయం తీసుకుని చెప్తానని హైకోర్టుకు తెలిపారు. దీంతో వీరికి ఇప్పటికిప్పుడు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.

Also Read : బాబు వ్యూహం ఫలిస్తుందా..?

లిక్కర్ స్కాంలో ఇప్పటికే అరెస్ట్ అయిన కొందరు నిందితులు తమ పేర్లు చెప్పారని, కాబట్టి తాము అరెస్టు అయ్యే అవకాశం ఉందని బాలాజీ గోవిందప్పతో పాటు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి భయపడుతున్నారు. ఇదే విషయాన్ని కోర్టుకు కూడా చెప్పారు. అయితే హైకోర్టు మాత్రం ప్రభుత్వ అభిప్రాయం తీసుకోకుండా ముందస్తు బెయిల్ ఇవ్వలేమని తేల్చిచెప్పేసింది. అయితే ఆలోపు సీఐడీ వీళ్లను అరెస్టు చేయకుండా హైకోర్టు మధ్యంతర ఆదేశాలేవీ ఇవ్వనందున ఏం జరుగుతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

Also Read : లోకేష్‌ పదవిపై ఫుల్ క్లారిటీ..!

హైకోర్టు వ్యాఖ్యలతో తాడేపల్లి ప్యాలెస్‌లో గుబులు మొదలైనట్లు తెలుస్తోంది. వాస్తవానికి మద్యం కుంభకోణంపై సీఐడీ విచారణ ప్రారంభమైన రోజు నుంచే వైసీపీ నేతల్లో అలజడి ప్రారంభమైంది. ఎందుకంటే.. మద్యం కుంభకోణం మొత్తం కూడా తాడేపల్లి ప్యాలెస్ చుట్టూనే తిరిగింది. లిక్కర్ స్కామ్‌లో వేల కోట్లు చేతులు మారాయనేది తొలి నుంచి వినిపిస్తున్న ఆరోపణ. అంతా ముందు నుంచి ఊహించినట్లే.. మూలాలన్ని తాడేపల్లి ప్యాలెస్‌లోని అనకొండ దగ్గరే మొదలైంది అనేది బహిరంగ రహస్యం. అయితే ఎక్కడా తన పేరు నేరుగా బయటకు లేకుండా.. ఓ చైన్ బిజినెస్‌ మాదిరిగా వేల కోట్లను హవాలా రూపంలో దేశం దాటించిన ఘనత ఆ అనకొండకే దక్కుతుంది. రాజ్ కేసిరెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగా లిక్కర్ స్కాంపై దర్యాప్తును మరింత వేగవంతం చేసేందుకు సీఐడీ సిద్దమవుతోంది. ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డిని విచారించినా పూర్తి వివరాలు లభించకపోవడంతో మరిన్ని అరెస్టులు చేసేందుకు సీఐడీ పావులు కదుపుతోంది.

Also Read : ఓపిక తక్కువ ఎమ్మెల్యేలు.. మోది ప్రసంగం మధ్యలోనే

సీఐడీ విచారణలో తీగ లాగితో డొంక కదిలినట్లుగా.. ఒక్కొక్కరిని అరెస్టు చేస్తుంటే.. లింక్ క్రమంగా ప్యాలెస్ వైపు వెళ్తోంది. రాజ్ కసిరెడ్డి అరెస్టు తర్వాత ఎవరా కీలక వ్యక్తి అని అంతా ఆలోచిస్తుంటే.. అన్ని వేళ్లు బాలాజీ గోవిందప్ప వైపు చూపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఎవరికీ పెద్దగా తెలియకపోయినప్పటికీ.. ఈ బాలాజీ గోవిందప్ప గురించి ప్యాలెస్ పెద్దలకు, వైసీపీ అగ్రనేతలకు మాత్రం బాగా తెలుసు. వైఎస్ భారతీ రెడ్డి నిర్వహిస్తున్న భారతీ సిమెంట్ సంస్థలో గోవిందప్ప బాలాజీ హోల్ టైమ్ డైరెక్టర్‌గా ఉన్నారు. 2010 నుంచి భారతీ సిమెంట్ సంస్థలో బాలాజీ గోవిందప్ప.. ఫైనాన్స్, ఐటీ విభాగాలకు డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఇవన్నీ పక్కన పెడితే.. వైఎస్ భారతీ రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో బాలాజీ గోవిందప్ప ఒకరు అనేది వైఎస్ కుటుంబ సభ్యులకు, వైసీపీ అగ్రనేతలకు తెలుసు.

Also Read : కావాలనే తగలబెట్టారా..? కేంద్ర హోంశాఖకు నివేదిక

లిక్కర్ స్కామ్‌లో ఒక్కొక్కరి అరెస్టుతో కలుగులో ఉన్న ఎలుకలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నిన్నటి వరకు బాలాజీ గోవిందప్ప ఎవరో కూడా చాలా మందికి తెలియదు. కానీ రాజ్ కసిరెడ్డి అరెస్టు తర్వాత.. తన అరెస్టు కూడా తప్పదని గోవిందప్పలో భయం మొదలైంది. దీంతో వెంటనే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. గోవిందప్పను అరెస్టు చేసి విచారణ జరిపితే.. ఆయన నోటి నుంచి వచ్చే ఫస్ట్ పేరు వైఎస్ భారతీ రెడ్డి. అది ఎంత చిన్న విషయమైనా.. పెద్ద విషయమైనా సరే.. నేరుగా భారతీ రెడ్డితోనే డీలింగ్ పెట్టుకుంటారు గోవిందప్ప. సూట్‌కేసు కంపెనీల ద్వారా వందల కోట్ల డబ్బును హవాలా మార్గంలో తాడేపల్లి ప్యాలెస్‌కు పంపించినట్లు బాలాజీ గోవిందప్ప పైన ఆరోపణలు. భారతీ రెడ్డికి అత్యంత ఆప్తుల్లో బాలాజీ గోవిందప్ప ఒకరు. దీంతో గోవిందప్ప ముందస్తు బెయిల్ కోసం ఏకంగా హైకోర్టునే ఆశ్రయించారు. కానీ ఉన్నత న్యాయస్థానం మాత్రం ప్రభుత్వ అభిప్రాయం కోరింది. దీంతో వైసీపీ నేతల గుండెల్లో రాయి పడినట్లు అయ్యింది. గోవిందప్పను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో సీఐడీ అధికారులు విచారిస్తే.. మేడం పేరు చెప్పడం ఖాయమంటున్నారు ప్యాలెస్ సన్నిహితులు. అదే జరిగితే.. వెంటనే మేడం కూడా అరెస్టు అవుతారా… అదే జరిగితే.. పెద్ద సారు పరిస్థితి ఏమిటీ.. తెలియాలంటే.. కొన్నాళ్లు వేచి చూడాల్సిందే.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్