ఆస్ట్రేలియా పర్యటనలో భారత బౌలింగ్ విభాగం దారుణంగా విఫలం కావడం పట్ల అభిమానుల్లో ఇప్పటికీ ఆగ్రహం ఉంది. ఆస్ట్రేలియా లాంటి పేస్ మైదానాలు ఉన్న దేశం లో పర్యటనకు వెళ్ళినప్పుడు సమర్థవంతమైన బౌలర్లు ఉండాలి. కానీ భారత జట్టు మొత్తం బూమ్రా మీదనే ఎక్కువగా ఆధారపడింది. దీనితో రాబోయే ఇంగ్లాండ్ పర్యటన విషయంలో సెలెక్షన్ కమిటీ బౌలింగ్ విభాగం పై ఎలా దృష్టి పెడుతుంది అనేది ఇప్పుడు అందరిలో ఉన్న ప్రశ్న. జట్టులో బూమ్రా మినహా మరో బౌలర్ సమర్థవంతంగా కనబడటం లేదు.
Also Read : తోపుదుర్తి సేవలో రాప్తాడు పోలీసులు
మహమ్మద్ షమీ ఐపిఎల్ సీజన్ లో దారుణంగా విఫలం కావడంతో అతను ఇంగ్లాండ్ పర్యటనలో ఎంతవరకు ప్రభావం చూపిస్తాడు అనేది చెప్పలేని పరిస్థితి. 2023 ప్రపంచ కప్ తర్వాత అతను గాయపడి ఇటీవలే జట్టులోకి వచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో పర్వాలేదు అనిపించినా ఆ తర్వాత మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక రాబోయే ఇంగ్లాండ్ పర్యటనలో అతను అత్యంత కీలకం కానున్నాడు. ఇంగ్లాండ్ మైదానాలపై ఎంతవరకు అతను ప్రభావం చూపుతాడు అనేది చెప్పలేం.
Also Read : ఇంగ్లీష్ టూర్‌కు ఆ ముగ్గురూ ఫిక్స్..?
ఇక యువ బౌలర్లు హర్షిత్ రానా.. ప్రసిద్ కృష్ణ దాదాపుగా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే సంకేతాలు కనపడుతున్నాయి. వీళ్ళిద్దరి బౌలింగ్ లో స్వింగ్ బాగుంటుంది. ఇక వీరితోపాటు మరో యవ బౌలర్ ఎవరైనా ఇంగ్లాండ్ పర్యటనకు వెళతారా అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. ఇంగ్లాండ్ మైదానాల్లో స్వింగ్ తో పాటుగా పేస్ కూడా బలంగా ఉండాలి. కాబట్టి భువనేశ్వర్ కుమార్ మళ్లీ టెస్ట్ జట్టులోకి వస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. అతనితోపాటు యంగ్ పేస్ గన్.. మయాంక్ యాదవ్ కూడా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే సంకేతాలు కనబడుతున్నాయి. ఇతనిలో వేగం ఉన్న నిలకడ తక్కువ. గత కొన్ని రోజులుగా అతనికి బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అసోసియేషన్ లో ట్రైనింగ్ ఇస్తున్నారు. అయితే ఇంగ్లాండ్ పర్యటనకు అతను వెళ్లడం ఖాయమని తెలుస్తోంది. ఏది ఎలా ఉన్నావ్ పేస్ బౌలింగ్ విభాగం బలంగా లేకపోతే ఇంగ్లాండ్ లో ఘోర ఓటమి తప్పదు.