Monday, October 27, 2025 10:30 PM
Monday, October 27, 2025 10:30 PM
roots

బాబు వ్యూహం ఫలిస్తుందా..?

ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు అమరావతి విషయంలో ఏ స్థాయిలో ఫోకస్ పెట్టారో దాదాపుగా అందరికీ ఈ మధ్య కాలంలో క్లారిటీ వచ్చింది. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ.. అటు కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకుంటూ చంద్రబాబు అమరావతి పనులను పరుగులు పెట్టించే దిశగా కదులుతున్నారు. ఇక అమరావతి పనుల పునఃప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించాలి అనే వ్యూహమే ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. పదేళ్ళ క్రితం ఇదే మోడీ అమరావతికి శంకుస్థాపన చేసారు.

Also Read : అమరావతి గెజిట్ సాధ్యమేనా..?

మళ్ళీ ఇప్పుడు మోడీతోనే చంద్రబాబు పనులను తిరిగి మొదలుపెట్టించే దిశగా అడుగులు వేయడం ఆశ్చర్యం కలిగించింది. దీనిపై ఎవరు ఎన్ని విమర్శలు చేసినా.. అమరావతి అనే బ్రాండ్ విషయంలో చంద్రబాబు పెట్టిన ఫోకస్ కారణంగానే మోడీకి ఆహ్వానం అందింది అనే విషయం అర్ధమవుతోంది. గత అయిదేళ్ళ నుంచి అమరావతి పనుల్లో ఏ విధమైన పురోగతి కనపడలేదు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని నాశనం చేసే దిశగా అడుగులు వేసింది అనేది స్పష్టంగా అర్ధమైంది. దీనితోనే రాష్ట్రానికి పెట్టుబడులు ఇప్పుడు రావడం కష్టమైంది.

Also Read : మళ్లీ కుంటి సాకులు చెబుతున్న జగన్..!

అప్పట్లో పెట్టుబడిదారులను వేధించడం ఒకటి అయితే, రాజధాని విషయంలో అనుసరించిన వైఖరి పెట్టుబడులను అడ్డుకున్నాయి. ఇటీవల బిల్ గేట్స్ ను కలిసినా, ఇప్పుడు అమరావతికి మోడీని ఆహ్వానించినా పెట్టుబడులే లక్ష్యం అనేది అర్ధమవుతోంది. అమరావతి బ్రాండ్ ను మరోసారి పాపులర్ చేయాలనే లక్ష్యంతోనే అడుగులు పడుతున్నాయి. పెట్టుబడిదారులకు ధైర్యాన్ని కల్పించే దిశగా పడుతున్న అడుగులు ఇవి. కేంద్రం కూడా అమరావతికి సహకారం అందించడంతో.. పనులు ఆగకపోవచ్చు. మరి బ్రాండ్ వాల్యూ ఎంత క్రియేట్ అవుతోంది అనేది చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్