Friday, September 12, 2025 09:24 PM
Friday, September 12, 2025 09:24 PM
roots

సాక్షిపై సాయిరెడ్డి యుద్ధం..!

విజయసాయిరెడ్డి రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో రాజకీయాలపై అవగాహన ఉన్న వారికి స్పష్టంగా తెలుసు. చార్టడ్ అకౌంటెంట్‌గా మంచి పేరున్న సాయిరెడ్డి.. దొంగ లెక్కలు రాయడంలో దిట్టా అనే పేరుంది. జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి నంబర్ టూ. సీబీఐ, ఈడీ కేసుల్లో ఏ1 జగన్ మోహన్ రెడ్డి అయితే.. సాయిరెడ్డి ఏ2. జగన్‌తో పాటు 16 నెలలు జైలు జీవితం గడిపారు. ఇక జగన్ బెయిల్ పై 11 ఏళ్లుగా బయటే ఉన్నారంటే.. అందుకు ఏకైక కారణం సాయిరెడ్డి. కేంద్ర పెద్దలతో మంతనాలు.. లాబీయింగ్.. ఇలా అవకాశం ఉన్నంత వరకు తన వంతు ప్రయత్నాలు చేశారు. దీంతో సాయిరెడ్డిని కేంద్ర పెద్దలు పేరు పెట్టి పలకరించే స్థాయికి చేరుకున్నారు. ఒకానొక సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ సైతం.. “సాయిరెడ్డి గారు.. బాగున్నారా..” అని స్వయంగా పలకరించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

Also Read : బ్యాంక్ ఖాతాలపై సంచలన నిర్ణయం

2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి, వైసీపీ గెలుపునకు ప్రధాన కారణం ఎవరు అంటే కేవలం సాయిరెడ్డి అని మాత్రమే. నాటి కేంద్ర పెద్దలతో మంతనాలు జరపడంతో పాటు ఏపీలోని అధికారులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించడం వెనుక కూడా విజయ సాయిరెడ్డి పాత్ర చాలా కీలకం. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సాయిరెడ్డిని పూర్తిగా పక్కన పెట్టిన జగన్.. అప్పటి వరకు ఎవరికీ తెలియని సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రాధాన్యత ఇచ్చారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు పదవి కట్టబెట్టడంతో పాటు పార్టీ విషయాల్లో కూడా సజ్జలదే మెయిన్ రోల్ అయ్యింది. ఇక విశాఖ పార్లమెంట్ స్థానంపై సాయిరెడ్డి దృష్టిసారిస్తే.. సజ్జల దానికి బ్రేక్ కొట్టారు. దీంతో చివరి నిమిషంలో సాయిరెడ్డిని నెల్లూరు ఎంపీ స్థానం నుంచి వైసీపీ రంగంలోకి దింపింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సాయిరెడ్డి.. వైసీపీకి రాజీనామా చేశారు. రాజకీయాలకు కూడా గుడ్ బై చెప్పేశారు.

Also Read : కాంగ్రెస్‌కు బీఆర్ఎస్‌ షాక్ ఇస్తుందా..?

అయితే ప్రస్తుతం మద్యం కుంభకోణంపై విచారణ జరిపిస్తున్న ప్రభుత్వం.. ఇప్పటికే రాజ్ కసిరెడ్డి, ఎస్పీవై ఆగ్రో సంస్థ అధినేత సజ్జల శ్రీధర్ రెడ్డిలను సీఐడీ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసులో సాయిరెడ్డిని కూడా విచారించారు. దీంతో సాయిరెడ్డి మూలం అంటూ సాక్షి మీడియా ఆరోపణలు కూడా చేసింది. దీంతో సాయిరెడ్డి కూడా సాక్షి మీడియాపై ఎదురు దాడి చేశారు. తాను స్థాపించిన సంస్థ.. తనపై ఆరోపణలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో సాయిరెడ్డి సొంత మీడియా ప్రారంభిస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. వాస్తవానికి ఈ ప్రచారం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే వినిపించింది. విజయవాడ కేంద్రంగా ప్రారంభమైన ఓ శాట్‌లైట్ ఛానల్ ప్రతినిధులతో అప్పట్లో సాయిరెడ్డి స్వయంగా చర్చించారు కూడా. కానీ ఆ ప్రతిపాదన విరమించుకున్నారు. ఆ తర్వాత కొద్ది నెలల క్రితం ఓ ప్రభుత్వ ఉద్యోగినితో వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చినప్పుడు కూడా తానే స్వయంగా ఓ న్యూస్ ఛానల్ ప్రారంభిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అప్పటికి సాయిరెడ్డి రాజకీయాల్లోనే ఉన్నారు.

Also Read : షిర్డీ సాయిపై పవన్ ఫోకస్, విచారణకు రంగం సిద్దం..!

ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు ప్రకటించిన సాయిరెడ్డి.. తరచూ హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ మధ్య ప్రయాణాలు చేస్తున్నారు. కేంద్ర పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. త్వరలోనే “వి న్యూస్” పేరుతో ఛానల్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. దీనికి కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్న ఓ ప్రముఖ పారిశ్రామిక వేత్త ఫైనాన్స్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఓ ఛానల్‌లో సీఈఓగా వ్యవహరిస్తున్న ఓ సీనియర్‌తో చర్చలు జరుపుతున్నట్లు ప్రస్తుతం మీడియా వర్గాల్లో చర్చ జోరుగా నడుస్తోంది. ఈ న్యూస్ ఛానల్ పూర్తిగా సాక్షికి వ్యతిరేకంగా పని చేయనున్నట్లు తెలుస్తోంది. మరి విజయ సాయిరెడ్డి పెట్టిన టార్గెట్ సాక్షి… లక్ష్యాన్ని చేరుతుందా లేదా చూడాలంటే.. కొద్దిరోజులు ఆగాల్సిందే.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్