Saturday, September 13, 2025 01:06 AM
Saturday, September 13, 2025 01:06 AM
roots

జగన్‌కు ఆ మాత్రం తీరిక లేదా..?

ఊరందరిదీ ఒక దారి.. ఉలిపిరి కట్టెది ఒక దారి అనేది సామెత. ఈ సామెత వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సరిగ్గా సరిపోతుంది. ఎవరేమైపోతే నాకెందుకు.. ఏం జరిగితే నాకెందుకు.. నాకు మాత్రం రాజకీయాలు కావాలి.. నాకు మాత్రం డబ్బే ప్రధానం.. నాకు అధికారమే ముఖ్యం.. అనేది వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీరు. ఇది ఇప్పటి నుంచి కాదు.. తొలి నుంచి కూడా ఇదే మాదిరిగా వ్యవహరిస్తున్నారు వైఎస్ జగన్. ఇంకా చెప్పాలంటే.. జాలీ దయ కరుణ అనే విషయాలు జగన్ చరిత్రలోనే లేవు. ఓట్ల కోసం ఎంత దూరమైన వెళ్తారు తప్ప.. పెద్దగా ఉపయోగం రాదు అనుకున్న విషయాలకు మాత్రం దూరంగా ఉంటారు. ఇంకా చెప్పాలంటే.. కనీసం అటు వైపు కన్నెత్తి కూడా చూడదు. అది దేశభక్తి విషయంలో అయినా సరే.. ప్రకృతి విపత్తు అయినా సరే. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే.. వారి వైపు కూడా వెళ్లడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఏ మాత్రం తీరిక దొరకదు.

Also Read : పాపం జగన్.. ఏం మాట్లాడాలో కూడా తెలియటం లేదా..!

రెండు రోజుల క్రితం కశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేశారు. ముష్కరుల దాడిలో ఇప్పటికే 30 మంది వరకు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రదాడిని భారతీయులు ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో వ్యతిరేకించారు. పహల్గాం ఉగ్రదాడిని దేశ మొత్తం ఖండించింది. దాడికి నిరసనగా ప్రదర్శనలు చేపట్టారు. మృతుల కుటుంబాలకు సంఘీభావంగా.. కొవ్వోత్తుల ర్యాలీ నిర్వహించారు. ముష్కరుల దాడిలో అమరులైన వారి ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు. పహల్గాం దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలను ప్రత్యక్షంగా పరామర్శించారు. చనిపోయిన వారి అంత్యక్రియల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జై హింద్ అంటూ నినాదాలు చేశారు. రాజకీయాలు, పార్టీలు, వర్గాలు, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. కానీ ఒక్కరు తప్ప. ఆయనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

Also Read : అందుకే దువ్వాడపై వేటు.. ఆ మాటే జగన్‌కు నచ్చలేదు..!

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన విశాఖ వాసి చంద్రమౌళి మృతదేహానికి సీఎం చంద్రబాబు బుధవారం రాత్రి నివాళి అర్పించారు. చంద్రమౌళి కుటుంబ సభ్యులను ఓదార్చారు. దేశంలో అస్థిరత సృష్టించేందుకు కొన్ని శక్తులు కుట్ర చేస్తున్నాయని.. రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఈ ఉగ్రదాడిలో మృతి చెందారని.. వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున 10 లక్షలు అందజేస్తామని ప్రకటించారు. అనంతరం శాంతి ర్యాలీలో పాల్గొన్నారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ‌కూడా మృతుల కుటుంబాలను పరామర్శించారు. బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం సహా దేశంలోని అన్ని పార్టీల నేతలు ముక్తకంఠంతో ఈ దాడిని ఖండించారు. అలాగే శాంతి ర్యాలీల్లో పాల్గొన్నారు.

Also Read : బెజవాడ జైల్లో వీఐపీ సందడి.. వంశీ టూ పీఎస్ఆర్

అయితే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం బెంగళూరు ఎలహంక ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్‌కు వచ్చారు తప్ప.. అందులో నుంచి కాలు బయటపెట్టలేదు. పైగా ప్రొద్దుటూరు, వెంకటగిరి మునిసిపాలిటీలు, అనంతపురం జిల్లా కంబదూరు, తిరుపతి రూరల్ వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జగన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ప్రారంభంలో రెండు నిమిషాలు మౌనం పాటించి సరిపెట్టారు. అది కూడా నవ్వుతూనే మౌనం పాటించారు. ఆ తర్వాత మళ్లీ యధావిధిగా రాజకీయ విమర్శలు చేశారు తప్ప.. ఇలాంటి కార్యక్రమం నిర్వహించిన తర్వాత రాజకీయాల గురించి మాట్లాడకూడదు అనే కనీస ఇంకిత జ్ఞానం కూడా లేకుండా పోయింది. రాజకీయాలకు ఇచ్చిన ప్రాధాన్యత అమరుల కుటుంబాలకు ఇవ్వలేకపోయారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read : అప్పుడు ఐఏఎస్‌లు.. ఇప్పుడు ఐపీఎస్‌లు..!

పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద కొవ్వోత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వైసీపీ నేతలు, కార్యకర్తలు కొవ్వొత్తులతో సంఘీభావం తెలిపారు. పార్టీ కార్యాలయం బయట జరిగిన కార్యక్రమంలో కూడా పాల్గొనలేనంత బిజీగా ఉన్న జగన్ ఉన్నారా అని ఇప్పుడు అంతా ప్రశ్నిస్తున్నారు. ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూసే జగన్.. దేశభక్తి, ప్రకృత్తి విపత్తుల విషయంలో మాత్రం సైలెంట్‌గా ఉండటం ఏమిటని నిలదీస్తున్నారు. పార్టీ నేతల ఇంట్లో కార్యక్రమాలకు హాజరవుతారు. అలాగే శవం కనిపిస్తే చాలు.. అక్కడికి హెలికాఫ్టర్ వేసుకుని మరీ వెళ్తారు. అంతే తప్ప.. ఇలాంటి సామాజిక అంశాలకు మాత్రం జగన్ దూరంగా ఉండటం ఏమిటని నిలదీస్తున్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో కూడా జగన్ వ్యవహార శైలి తీవ్ర విమర్శలకు తావిస్తోంది. హుద్ హుద్ తుఫాన్ సమయంలో హైదరాబాద్‌లో సినిమా చూశారు. ఇక విజయవాడ వరదలప్పుడు కూడా జగన్ ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదు. 2010లో రాజకీయ లబ్ది కోసమే ఓదార్పు యాత్ర చేశారు తప్ప.. ప్రజలపై ఎలాంటి ప్రేమ జగన్‌కు లేదని విమర్శలు చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్