జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి తర్వాత దేశవ్యాప్తంగా ఉగ్రవాదులు కదలికలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు అలాగే ఇంటెలిజెన్స్ వర్గాలు దృష్టి సారించాయి. కీలక నగరాలు, రద్దీ ప్రాంతాల్లో ఉగ్రవాదులు కదలికలు ఉన్నాయని అనుమానాలను ఇంటెలిజెన్స్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఉగ్రవాదులు పాగా వేశారనే అనుమానాలను నిఘా వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. హైదరాబాదులో ఇటీవల ఉగ్రవాదుల కదలికలను పోలీసులు గుర్తించారు. దీనితో పాతబస్తీ సహ అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read : అప్పుడు ఐఏఎస్‌లు.. ఇప్పుడు ఐపీఎస్‌లు..!
ఇక తాజాగా విజయవాడ నగరంలో కూడా ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడ నగరంలో మొత్తం పదిమంది ఉగ్రవాదులు తిష్ట వేసినట్లు కేంద్ర నిఘా వర్గాలు వెల్లడించాయి. ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వీరు నివాసం ఉంటున్నారని తెలిపాయి. ఇంటిలిజెన్స్ వర్గాల రాడారులో పదిమంది అనుమానితులు ఉన్నట్లు సమాచారం. వీరిలో నలుగురు విజయవాడ నగరంలోని నివాసం ఉంటున్నారట. తెలుగు కూడా నేర్చుకుని స్థానికుల్లో ఒకరిగా కలిసిపోయారని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి.
Also Read : బ్రేకింగ్: కొత్త పెన్షన్లకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
వాళ్లలో కొంతమంది ఏసీ మెకానిక్ లు, మరి కొంతమంది మసీదుల దగ్గర భిక్షాటన చేస్తూ మరికొంతమంది చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని.. మరి కొంతమంది బైక్ మెకానికులుగా బతుకుతున్నారని ఇంటిలిజెంట్ వర్గాలు హెచ్చరించాయి. గతంలో నక్సల్ ఉద్యమానికి విజయవాడ కీలకంగా ఉండేది. కొండపల్లి సీతారామయ్య వంటి వారు విజయవాడ నుంచి కార్యకలాపాలు సాగించేవారు. ఆ తర్వాత మావోయిస్టులకు కూడా విజయవాడ కేంద్రంగా ఉండేది. కమ్యూనిస్టు ప్రభావం కృష్ణాజిల్లాలో ఎక్కువగా ఉండటంతో మావోయిస్టులు విజయవాడలో తమ కార్యకలాపాలను కొన్నాళ్లపాటు కొనసాగించారు. ప్రస్తుతం పలు ఇస్లామిక్ సంస్థల కార్యక్రమాలు విజయవాడలో కొనసాగుతున్నట్లు అనుమానిస్తున్నారు.