Friday, September 12, 2025 08:58 PM
Friday, September 12, 2025 08:58 PM
roots

యుద్ధంలోనే పుట్టాం.. యుద్దమే చేస్తాం

రాజకీయంగా ఇబ్బందులు పడుతున్న తరుణంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. తాజాగా ఆయన తాడేపల్లి నివాసంలో పార్టీ కీలక నేతలతో సమావేశం నిర్వహించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ పార్టీలో అత్యున్నతమైనదన్నారు జగన్. ఇందులో తీసుకునే నిర్ణయాలు పార్టీ దశ, దిశను నిర్ణయిస్తాయని.. ప్రతి అంశంమీద పార్టీకి దిశానిర్దేశం చేస్తుందని తెలిపారు. వివిధ అంశాలమీద సమగ్రంగా చర్చిస్తూ, పార్టీకి సూచనలు చేస్తుందని వెల్లడించారు.

Also Read : తమ్ముడిపై రివేంజ్ ప్లాన్‌లో కేసినేని నానీ.. చంద్రబాబుకు సంచలన లేఖ

అంతేకాక రాబోయే రోజుల్లో పార్టీ ఏం చేయాలన్నదానిపైనకూడా తగిన ఆలోచనలు చేస్తుంది. సలహాలు ఇస్తుందని…ప్రతి నెలా కూడా PAC సమావేశం అవుతుందని పేర్కొన్నారు. పార్టీని పునర్‌ నిర్మించే కార్యక్రమంలో భాగంగా వివిధ బాడీలను నిర్మిస్తూ వస్తున్నాయని… జిల్లా అధ్యక్షులందర్నీకూడా మనం నియమించామని.. వాళ్లు క్షేత్రస్థాయిలో గట్టిగా యుద్ధంచేస్తున్నారని తెలిపారు. వైయస్సార్‌సీపీ యుద్ధ వాతావరణంలోనే పార్టీ పుట్టిందని.. పార్టీ పుట్టిన తర్వాత పదేళ్లపాటు మనం యుద్ధ వాతావరణంలోనే ఉన్నామని అన్నారు. భవిష్యత్తులో కూడా యుద్దమే చేస్తామన్నారు.

Also Read : బీజేపీకే రాజ్యసభ.. లోకల్ కాదు నాన్ లోకల్

రాబోయే రోజుల్లో పార్లమెంటు నియోజకవర్గాలకు అబ్జర్వర్లు కూడా వేస్తామని స్పష్టం చేసారు. రీజినల్‌ కో-ఆర్డినేటర్లకు వీళ్లు అన్నిరకాలు సహాయపడతారని తెలిపారు. పార్టీ సమన్వయానికి బాగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ నియామకాలు పూర్తై పార్టీ యంత్రాంగం పూర్తిస్థాయిలో నిర్మాణం అయినట్టేనన్నారు. జిల్లా అధ్యక్షులు, పార్టీ మెంటు నియోజకవర్గాలకు అబ్జర్వర్లు, పీఏసీ ఏర్పాటు ఇలా అన్నిరకాలుగా పార్టీ నిర్మాణం అవుతోందని తెలిపారు. ఇక గ్రామస్థాయికి కూడా పార్టీ వెళ్లాలని.. బూత్‌ లెవల్‌ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవాలన్నారు. వచ్చే ఆరు నెలల్లో మొత్తం నిర్మాణం పూర్తికావాలని స్పష్టం చేసారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్