ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో పేదలకు అదిరిపోయే కానుక ఇవ్వడానికి సిద్దమవుతోంది. పెద్ద ఎత్తున గృహ ప్రవేశాలకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి త్వరలో ఏడాది పూర్తి కానున్న సందర్భంగా.. జూన్ 12 న భారీగా గృహ ప్రవేశాలకు ప్రభుత్వం సిద్దమైంది. జూన్ 12, 2024న నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మూడు లక్షల పేదలకు ఇళ్లను అందిస్తూ, అదేరోజు వారితో గృహప్రవేశ కార్యక్రమం నిర్వహిస్తారు.
Also Read : విశాఖ మేయర్ ఎన్నిక.. జగన్‌కు బూమ్‌రాంగ్..!
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఇళ్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని చంద్రబాబు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో 1.70 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. మరో 60 వేల ఇళ్లు తుది దశలో ఉన్నాయి. మిగిలిన ఇళ్ల నిర్మాణాలను గడువులోగా పూర్తి చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఎలాగైనా సరే ఈ కార్యక్రమం విజయవంతం కావాలని లక్ష్యంగా పెట్టుకున్న ఏపీ సర్కార్.. అధికారులను పరుగులు పెట్టిస్తోంది.
Also Read : హర్ష కుమార్ కు కూటమి భయపడుతుందా..?
హౌసింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ నిత్యం జిల్లా కలెక్టర్లు, గృహ నిర్మాణ శాఖ అధికారులుతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. గతంలో కూడా టీడీపీ పెద్ద ఎత్తున గృహ ప్రవేశాలు నిర్వహించింది. అప్పట్లో చంద్రబాబు సర్కార్ పూర్తి చేసిన ఇళ్ళను పేదలకు పంచకుండా.. జగన్ సర్కార్ కాలయాపన చేసిన సంగతి తెలిసిందే. కొన్ని నివాసాలకు రంగులు వేసి అలా వదిలేసింది. వాటికి ఇప్పటికే మరమత్తులు చేస్తారు. కొన్ని ఇళ్ళను పెద్ద ఎత్తున నిర్మిస్తున్నారు అధికారులు.




