పోషకాహార లోపం ఉన్న టీనేజర్లు, యువకులను ప్రభావితం చేసే కొత్త రకమైన డయాబెటిస్ ను గుర్తించారు. దీనిని అధికారికంగా “టైప్ 5 డయాబెటిస్” గా గుర్తించారు. బ్యాంకాక్‌లో జరిగిన వరల్డ్ డయాబెటిస్ కాంగ్రెస్ 2025లో ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ (IDF) ఈ ప్రకటన చేసింది. టైప్ 5 డయాబెటిస్ ప్రపంచవ్యాప్తంగా 25 మిలియన్ల మందిని ప్రభావితం చేస్తుందని వెల్లడించారు. టైప్ 1 డయాబెటిస్ ఉన్నవారికి సాధారణంగా రక్తంలో చక్కెర లెవెల్స్ ను కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ (హార్మోన్) ఇంజెక్షన్లు అవసరం.
Also Read : మళ్ళీ సాయి రెడ్డేనా..? రాజ్యసభ ఉప ఎన్నిక సందడి షురూ
ఈ రకమైన మధుమేహం ఆసియా, ఆఫ్రికా వంటి దేశాలలో చాలా కాలంగా కనిపిస్తుంది. కాని దీనిపై ఇప్పటి వరకు ఒక స్పష్టమైన అవగాహన లేదు. టైప్ 1 లేదా టైప్ 2 డయాబెటిస్‌గా చెప్తూ వచ్చారు. శాస్త్రవేత్త డాక్టర్ మెరెడిత్ హాకిన్స్ నేతృత్వంలో జరుగుతున్న పరిశోధనల్లో.. దీనికి కొత్త నామం కేటాయించారు. పోషకాహార లోపం సంబంధిత మధుమేహం అని కూడా దీనిని పిలుస్తారు. ఈ టైప్ 5 డయాబెటిస్, ముఖ్యంగా బాల్యంలో దీర్ఘకాలిక పోషకాహార లోపం ఎదుర్కొన్న వారిని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది.
Also Read : డ్రామా బయటపడుతుందని వైసీపీ భయపడుతోందా..?
ఊబకాయం,ఇన్సులిన్ లెవెల్స్ తక్కువగా ఉండే టైప్ 2 డయాబెటిస్ మాదిరిగా కాకుండా పోషకాహార లోపం వల్లనే ఎక్కువగా వస్తున్నారు. టైప్ 5 డయాబెటిస్ ఉన్న చాలా మందికి ఇన్సులిన్ ఇంజెక్షన్లు కూడా అవసరం లేకపోవచ్చు. ఓరల్ గా తీసుకునే మందులతో కంట్రోల్ చేయవచ్చు. పోషకాహార లోపానికి సంబంధించిన మధుమేహం మొదట 1950లలో గుర్తించినా ఇప్పటి వరకు దీనికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 నుండి 25 మిలియన్ల మంది టైప్ 5 డయాబెటిస్‌తో జీవిస్తున్నారని అంచనా.