Friday, September 12, 2025 07:26 PM
Friday, September 12, 2025 07:26 PM
roots

ఎంపీకి రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

తెలంగాణాలో మంత్రి పదవుల గురించి రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఖాళీ ఉన్న మంత్రి పదవుల కోసం పలువురు ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. ఇక కొందరు గత రెండు మూడు రోజుల నుంచి బహిరంగంగానే తమ మనసులో మాట బయటపెడుతున్నారు. కీలక నేతలతో పాటుగా రేవంత్ రెడ్డితో సన్నిహితంగా ఉండే నాయకులు కూడా మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. మల్రెడ్డి రంగా రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి వారు నిన్న గట్టిగానే మాట్లాడారు.

Also Read : ధోనీపై ఆగని తిట్ల వర్షం

ఇక కొందరు ఎంపీలు కూడా మంత్రి పదవుల విషయంలో కాస్త జోక్యం చేసుకుని ప్రకటనలు చేస్తున్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి తాజాగా అసహనం వ్యక్తం చేసారు. ఎంపీ చామాల కిరణ్ కుమార్ రెడ్డి పై ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు, ఇక్కడ మాట్లాడితే లాభం కంటే నష్టం ఎక్కువ అంటూ హెచ్చరించారు. మంత్రి పదవులు కోరే వాళ్ళు మాట్లాడితే మీకే నష్టమన్నారు. ఎంపీ చామల కిరణ్‌కి సీఎం రేవంత్‌రెడ్డి క్లాస్‌ పీకారు.

Also Read : బ్రాండ్ ప్రొమోషన్లకి ‘నో చెబుతున్న’ సమంత.. కారణమేంటి?

రోజుకొకరిని మంత్రిగా నువ్వే ప్రకటిస్తున్నావు.. ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. మంత్రి వర్గం అధిష్టానం ఇష్టం, ఇప్పటికే అధిష్టానం చర్చలు జరిపింది అన్నారు. ఇంకోసారి మంత్రి వర్గ విస్తరణ పై మాట్లాడొద్దు అంటూ రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. రెండోసారి అధికారం లోకి రావడమే ప్రధాన లక్ష్యం అన్నారు. అందుకు అనుగుణంగా పని చేయండి, ఎమ్మెల్యేలను కలుస్తాను అన్నారు సీఎం. నియోజక వర్గంలో గెలవడానికి కావలసిన ప్రాజెక్టులు తెచ్చుకోండని.. పూర్తి చేయించే బాధ్యత నాది, అనవసరమైన మాటలు వద్దన్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్