ఏబీ వెంకటేశ్వరరావు… ఈ పేరు వినగానే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేది ధీటైన పోలీస్. నిజమే.. ఒక సాధారణ రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి డీజీపీ స్థాయి వరకు చేరటం మామూలు విషయం కాదు. దాని వెనుక ఎంతో కష్టం ఉంది. లక్ష్యం ఉన్నతం.. దాని సాధన కోసం పడిన శ్రమ అనిర్వచనీయం. ఏడాది క్రితం వరకు ఈ పేరు ప్రతి రోజూ వినిపించింది. ఏబీవీ పదవీ విరమణ తర్వాత సైలెంట్ అయ్యారు. కానీ ఇప్పుడు మరోసారి ఏబీవీ పేరు మారుమోగుతోంది. ఇంకా చెప్పాలంటే.. ఏపీ రాజకీయాల్లో ఒక కుదుపు కుదిపేస్తోంది. ఇందుకు ప్రధాన కారణం.. ఏబీ వెంకటేశ్వరరావు రాజకీయాల్లోకి అడుగుపెట్టడమే. ఈ చర్చ అటు పొలిటికల్ సర్కిల్‌లో ఇటు పబ్లిక్‌లో పెద్ద దుమారం రేపుతోంది.
Also Read : కేబినెట్ మౌనం ఎందుకు..? జగన్ కు ఛాన్స్ ఇస్తున్నారులే
2014-2019 టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటిలిజెన్స్ చీఫ్‌గా పని చేశారు. దీంతో ఆయనను అంతా ఐబీ వెంకటేశ్వరరావు అని కూడా పిలుస్తారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు అత్యంత నమ్మకమైన వ్యక్తి అని ప్రచారం. టీడీపీ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వాళ్లంతా పార్టీ మారటం వెనుక ఏబీవీ హస్తం ఉందనేది వైసీపీ నేతల మాట. తమ పార్టీ నేతలను ఏబీవీ భయపెట్టడం వల్లే పార్టీ ఫిరాయించారని కూడా ఆరోపించారు. అదే సమయంలో టీడీపీ నేతలు కూడా ఏబీవీ పై విమర్శలు చేశారు. ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చిన తప్పుడు సర్వే రిపోర్టుల కారణంగానే 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు టికెట్లు కేటాయించారని.. అందుకే టీడీపీ ఓడిందని కూడా వ్యాఖ్యానించారు.
Also Read : బీజేపీతో డీల్ సెట్ చేసుకున్న సాయిరెడ్డి
ఇక 2019 జూన్‌లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఏబీవీపై కక్షసాధింపు చర్యలు చేపట్టింది. ఇంకా చెప్పాలంటే టార్గెట్ ఏబీవీ అన్నట్లుగా జగన్ సర్కార్ అడుగులు వేసింది. ఏబీ వెంకటేశ్వరరావును అరెస్టు చేయాలని శతవిధాలా ప్రయత్నించింది వైసీపీ ప్రభుత్వం. ముందుగా పోస్టింగ్ నుంచి తప్పించింది. ఆ తర్వాత ఆయన ఏరోస్టాట్, యూఏవీ భద్రత పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని 2020 ఫిబ్రవరిలో సస్పెండ్ చేసింది. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని.. తనపై వేసిన సస్పెన్షన్ రద్దు చేయాలని ఏబీవీ న్యాయపోరాటం చేశారు. ఏపీ హైకోర్టు మొదలు సుప్రీం కోర్టు వరకు తన పోరాటం కొనసాగించారు. ఒక దశలో జగన్ మోహన్ రెడ్డికి చుక్కలు చూపించారు కూడా. ఎలాగైనా సరే ఏబీ వెంకటేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలని నాటి వైసీపీ ప్రభుత్వం నానాపాట్లు పడింది. చివరికి కులం పేరుతో కూడా దూషించారు వైసీపీ నేతలు.
Also Read : జగన్ పాపాలు.. మన ప్రాజెక్టులు సెఫేనా..?
ఆయన వ్యక్తిగత విషయాలను కూడా బహిర్గతం చేశారు. హైదరాబాద్‌లో ఓ ఫంక్షన్‌కు వెళ్లిన సందర్భంలో.. అక్కడ కొంతమంది బీజేపీ నేతలను రహస్యంగా కలిశారని.. వాళ్లకు చంద్రబాబు నాయుడు డైరెక్షన్ ఇచ్చారని ఆరోపించారు కూడా. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏబీ వెంకటేశ్వరరావుపై రెండు సార్లు సస్పెన్షన్ వేటు పడింది. 2020 ఫిబ్రవరి నుంచి 2022 ఫిబ్రవరి 7 వరకు ఒకసారి.. 2022 జూన్ 28 నుంచి 2024 మే 30 వరకు రెండోసారి ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు వేశారు. భద్రత పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఏబీ వెంకటేశ్వరరావుపై అభియోగాల నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంలో ఆయన రెండు సార్లు సస్పెండ్ అయ్యారు. అయితే ఒకసారి ఆయన కోర్టును ఆశ్రయించి.. పోస్టింగ్ తెచ్చుకున్నారు. రెండోసారి క్యాట్‌ను ఆశ్రయించి ఊరట పొందారు. అయితే వైసీపీ ప్రభుత్వం మాత్రం ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు.
Also Read : మంత్రుల ఓఎస్డీల పై చంద్రబాబు గురి
దీంతో పోస్టింగ్ విషయమై మరోసారి కోర్డును ఆశ్రయించిన ఏబీ వెంకటేశ్వరరావు.. కోర్డు ఆదేశాలతో పదవీ విరమణకు కేవలం ఒక్కరోజు ముందు పోస్టింగ్ పొందారు. అది కూడా డీజీపీ స్థాయి అధికారికి అప్రాధాన్య విభాగంలో పోస్టింగ్ ఇచ్చారు. అయితే చివరి వరకు నిజాయితీగా విధులు నిర్వహించిన ఏబీ వెంకటేశ్వరరావు.. తన పోలీస్ యూనిఫాంలోనే రిటైర్ అయ్యారు. పదవీ విరమణ సమయంలో కూడా.. నాటి వైసీపీ ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేయకుండా చాలా హుందాగా వ్యవహరించారు. బాధ్యతలు స్వీకరించిన రోజే విరమణ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా వివాదాస్పద అంశాలు మాట్లాడలేనని, ప్రస్తుతానికి ఇంతవరకే మాట్లాడగలనని అన్నారు. చివరికి నిజాయితీ గెలిచింది అంటూ పదవీ విరమణ సమయంలో ఏబీ వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు నాటి జగన్ సర్కార్‌కు చెంపపెట్టు.
Also Read : ధర్మాన బ్రదర్స్ అంటే జగన్ కి మరీ ఇంత చులకనా..?
2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి ప్రభుత్వం.. ఏబీవీకి అండగా నిలిచింది. ఏబీ వెంకటేశ్వరరావుపై నమోదైన అభియోగాలను కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అనంతరం ఏబీవీ సస్పెన్షన్ కాలాన్ని ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. సస్పెన్షన్ కాలంలో రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని పోలీసు శాఖను ఆదేశించింది. ఆ తర్వాత ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఇదే పెద్ద దుమారం రేపింది కూడా. వాస్తవానికి ఏబీ వెంకటేశ్వరరావు ఎలాంటి పదవులు ఆశించలేదు. ఇంకా చెప్పాలంటే ఆయన ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీలో లేరు. ఏ పార్టీకి అనుకూలంగా లేరు. ఎక్కడా రాజకీయ పరమైన వ్యాఖ్యలు కూడా చేయలేదు. వ్యవస్థలో లోపాలు మాత్రమే ఆయన ఎత్తిచూపించారు. తనకు జరిగిన అన్యాయాన్ని, జగన్ ప్రభుత్వం తనపట్ల వ్యవహరించిన తీరును పలు సందర్భాల్లో సవివరంగా వివరించారు. దీంతో ప్రభుత్వ అధికారులతో పాటు ఉద్యోగులకు కనువిప్పు కలిగింది. ఆ ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది కూడా. కూటమి ప్రభుత్వం ఏబీవీ పట్ల సానుకూలంగా వ్యవహరించింది.
Also Read : వైసీపీ తాజా, మాజీ మధ్య లడాయి..!
సస్పెన్షన్ కాలాన్ని క్రమబద్ధీకరించడంతో పాటు… ఆయనకు నామినేటెడ్ పదవి కూడా ఇచ్చింది. అయితే తనను కనీసం సంప్రదించలేదన్నారు. ఎలాంటి సమాచారం లేకుండా పదవి ఇవ్వడం పట్ల ఏబీవీ అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్పోరేషన్ ఛైర్మన్ పదవిని తిరస్కరించారు. “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్ మోహన్ రెడ్డి అనే దెయ్యం ఇంకా వెంటాడుతోంది.” అంటూ ఏబీవీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాని కింద “జగన్.. never again” అని రాశారు. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ పెద్ద దుమారం రేపింది. రాష్ట్రానికి జగన్ పీడ శాశ్వతంగా తొలిగే మార్గం ఏదైనా ఉంటే ఆలోచించండి సార్.. ఇంకా పిచ్చి వెధవలు జగన్ కు సపోర్ట్ చేస్తున్నారు. సైకో అని తెలిసి కూడా.. అంటూ కామెంట్లు కూడా చేశారు నెటిజన్లు. ఇక మరికొందరైతే మీలాంటి నిజాయితీ పరులు రాజకీయాల్లోకి రావాలంటూ కామెంట్ చేశారు. ఇందుకు అనుగుణంగానే అమలాపురంలో ఏబీవీ మీడియా ముందు కుండబద్దలు కొట్టారు. ఏ రాజకీయ పార్టీలో చేరటం లేదన్నారు. అదే సమయంలో జగన్ బాధితులకు న్యాయం చేయడమే తన లక్ష్యమన్నారు.