ఐపీఎల్ అనగానే ఓనర్ల హడావుడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా లేడీ ఓనర్లు మైదానంలో సందడి చేస్తూ ఉంటారు. అప్పట్లో డెక్కన్ చార్జర్స్ ఓనర్ గాయత్రి రెడ్డి మైదానంలో ఎక్కువగా కనబడే వారు. ఆ తర్వాత ప్రీతి జింతా, నీతా అంబానీ, శిల్పా శెట్టి, కావ్యా మారన్, జూహి చావ్లా వంటి వారు మైదానాల్లో సందడి చేశారు. మ్యాచ్ విజయం సాధించిన తర్వాత ఆటగాళ్లను హగ్ చేసుకుంటూ వాళ్ళు చేసే సందడి అంతా ఇంత కాదు. దీన్ని అభిమానులు వినోదం గానే చూసేవారు.
Also Read : అలా వెళ్ళడానికి ఏమాత్రం సిగ్గుపడను
ఈ మధ్యకాలంలో ఓనర్లు కాస్త హడావుడి ఎక్కువగా చేస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఓనర్ తో పాటుగా లక్నో ఓనర్.. సంజీవ్ గోయెంకా వంటి వారు ఆటగాళ్లపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా గోయెంకా తీరుపై అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఐపీఎల్ సీజన్ సందర్భంగా కేఎల్ రాహుల్ ఆట తీరుపై అతను అసహనం వ్యక్తం చేశాడు. మైదానంలోనే ఆగ్రహం వ్యక్తం చేసిన ఫోటోలు బయటకు వచ్చాయి. దీని తర్వాత కాస్త అతని ప్రవర్తనలో మార్పు వచ్చిందని అభిమానులు ఆశించారు.
Also Read : జైస్వాల్ – రహానే మధ్య గొడవలు పీక్స్ కు
కానీ ఈ ఏడాది కూడా పంత్ విషయంలో అతను అలాగే వ్యవహరిస్తున్నాడు. అయితే వీరందరితో పోలిస్తే ప్రీతి జింటా వ్యవహార శైలి కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పటివరకు తన జట్టు ఒక్కసారి కూడా ఐపీఎల్ సీజన్ లో విజేతగా నిలవకపోయినా.. కేవలం ఒక్కసారి మాత్రమే ఫైనల్ కు వెళ్లినా ఆమె మాత్రం ఎక్కడ ఆటగాళ్ల తీరుపై అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు లేవు. కెప్టెన్ తో అలాగే ఇతర ఆటగాళ్లతో ఆమె సన్నిహితంగానే ఉంటుంది. మ్యాచ్ ఓడిపోయే దశలో కూడా ఆటగాళ్లపై ఎప్పుడు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం లేదు.
Also Read : తెలుగు వైపు చూస్తున్న మరో బాలీవుడ్ స్టార్
అలాగే ఆట విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకున్న సందర్భంగా కూడా లేదనే చెప్పాలి. టోర్నీ నుంచి తన జట్టు వైదొలిగే సందర్భంలో ఒక విజయం సాధించిన సరే చాలు అనుకుంటూ ఆమె సందడి చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో కూడా ఆటగాళ్లను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తుంది. మిగిలిన ఓనర్లు అందరూ ఆటగాళ్లపై ఏదో ఒక సందర్భంలో అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నా.. ఆమె మాత్రం ఎప్పుడూ ఆగ్రహించిన సందర్భాలు లేవు. ఈ విషయాన్ని ఆమె అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఆటను ఆటగా చూడాలని ఓనర్లు అందరూ ప్రీతి తరహాలో ప్రవర్తించాలంటూ కామెంట్ చేస్తున్నారు.