Friday, September 12, 2025 10:59 PM
Friday, September 12, 2025 10:59 PM
roots

మళ్ళీ వార్తల్లో సెంటినల్ తెగ.. అసలేం జరిగింది..?

కరోనా సమయంలో బాగా ఫేమస్ అయిన వాటిల్లో సెంటినల్ తెగ కూడా ఒకటి. అండమాన్ నికోబార్ దీవుల్లో నివాసం ఉండే ఈ తెగకు బయటి ప్రపంచంతో ఏ విధమైన సంబంధాలు ఉండవు. వారిని చూడటానికి వెళ్ళిన ఎవరిని అయినా సరే బాణాలతో వేటాడి చంపేస్తూ ఉంటారు ఆ తెగ వారు. అమెరికన్ మిషనరీ జాన్ అల్లెన్ చౌ , 2018లో సెంటినెలీస్‌ ను కలవడానికి ప్రయత్నం చేయగా అతన్ని చంపేసి.. అక్కడే పూడ్చివేసారు. ఆ తర్వాత అక్కడికి వెళ్లేందుకు ఎవరూ సాహసం చేయలేదు.

Also Read : మలేషియాలో క్యాంప్.. వైసీపీ బిగ్ ఆఫర్..!

30 సంవత్సరాలుగా ఆ తెగకు బయటి ప్రపంచంతో సంబంధం లేదు. తాజాగా ఓ అమెరికన్ పర్యాటకుడు వాళ్ళను చూసేందుకు ప్రయత్నం చేయగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 24 ఏళ్ల మైఖైలో విక్టోరోవిచ్ పాలియాకోవ్‌ను మార్చి 31న అధికారులు అరెస్ట్ చేసారు. అతను ఎటువంటి అనుమతి లేకుండానే ఉత్తర సెంటినెల్ ద్వీపంలోకి ప్రవేశించాడని పోలీసులు తెలిపారు. సెంటినెలీస్‌ను ప్రపంచంలోని చివరి పూర్వ-నియోలిథిక్ తెగగా పరిగణిస్తారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆ వ్యక్తి మార్చి 26న పోర్ట్ బ్లెయిర్‌కు చేరుకుని కుర్మా డేరా బీచ్ నుండి నార్త్ సెంటినెల్ ద్వీపానికి వెళ్లాడు.

Also Read : ఎస్ రెడ్ బుక్ కోసమే పోలీసులు పని చేస్తారు

ఆ తర్వాత మార్చి 29న తెల్లవారుజామున 1 గంటల ప్రాంతంలో కుర్మా డేరా బీచ్ నుండి తన పడవలో బయలుదేరాడు. సెంటినెలీస్ కు ఇచ్చేందుకు కొబ్బరికాయ, కోలా డబ్బాను తీసుకున్నాడు అని పోలీసులు తెలిపారు. పోలియాకోవ్ ఉదయం 10 గంటలకు నార్త్ సెంటినెల్ ద్వీపం ఈశాన్య తీరానికి చేరుకుని బైనాక్యులర్లను ఉపయోగించి ఆ ప్రాంతాన్ని పరిశీలించాడు కానీ అక్కడ ఎవరూ కనపడలేదు. అతను ఒక గంట పాటు సముద్రం ఒడ్డున ఉండి, వారికి సిగ్నల్ ఇచ్చేందుకు ఈల ఊదుతూ వెళ్ళే ప్రయత్నం చేసినా వారి నుంచి ఎటువంటి స్పందన రాలేదు.

Also Read : ఆ సినిమా రీమేక్ చేస్తే.. ఎన్టీఆర్ ఒక్కడే బెస్ట్

అతను దాదాపు ఐదు నిమిషాలు బీచ్‌లో ఉన్నాడని పోలీసులు తెలిపారు మధ్యాహ్నం 1 గంటలకు, అతను తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించి.. రాత్రి 7 గంటలకు కుర్మా డేరా బీచ్ చేరుకున్నాడు. అక్కడ స్థానిక మత్స్యకారులు అతన్ని గుర్తించారు. అతను తన ప్రయాణాన్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. సముద్ర పరిస్థితులు, ఆటుపోట్లతో పాటుగా… కుర్మా డేరా బీచ్ కు వెళ్ళడానికి అందుబాటులో ఉన్న మార్గాలపై పరిశోధనలు చేసాడు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్