ఏపిలో వైసీపీ సోషల్ మీడియా మరియు దాని నాయకులు ఎలా పని చేస్తారో అందరికీ తెలిసిందే. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చూపిస్తూ ప్రభుత్వం పై బురద చల్లడమే లక్ష్యంగా రెచ్చిపోవడం గురించి ప్రజలకి తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని వైసీపీ నేతలు పదే పదే టార్గెట్ చేయడంపై మంత్రి నారా లోకేష్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. పాస్టర్ ప్రవీణ్ వ్యవహారంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంపై కూడా నారా లోకేష్ రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతున్న HCU స్థలం గొడవలో కూడా 2003లో చంద్రబాబు చేసిన దాని గురించి మాట్లాడుతున్నారన్నారు. ఇక పీ 4 పై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు మంత్రి నారా లోకేష్.
Also Read : భారత్ పాక్ సరిహద్దుల్లో మళ్ళీ అలజడి
విజనరీకి.. ప్రీజనరికి ఉన్న తేడా జగన్ కి తెలియదని ఎద్దేవా చేసారు. జగన్ చూపు ఎప్పుడూ జైలు గురించే అంటూ మండిపడ్డారు. కనిగిరి అభివృద్ధి కి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అభివృద్ధికి అడ్డుపడితే రెడ్ బుక్ లో పేరు నమోదు చేస్తామని హెచ్చరించారు. కనిగిరిలో స్థాపించ తలపెట్టిన ప్రాజెక్ట్ పై తప్పుడు ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలు ద్రోహులుగా మిగిలిపోతారని అన్నారు. ఒకరికి గుండె పోటు.. ఇంకొకరికి చేయి విరిగింది అని ఎద్దేవా చేశారు. జగన్ అధికారంలో ఉంటేనే కార్యకర్తల్ని పట్టించుకోలేదని.. ఇక అధికారం లేకపోతే ఏమి చేస్తారో వారే ఆలోచించుకోవాలి అని మండిపడ్డారు.
Also Read : మోడీ షాకింగ్ నిర్ణయం.. వారసుడు ఎవరు..?
జగన్ ఇక్కడే ఉన్నారు… జగన్ ఇంటి కోసం ఎన్నో వందల పేద కుటుంబాల ఇళ్ళని తొలగించారని విమర్శించారు. పాస్టర్ ప్రవీణ్ విషయంలో ప్రభుత్వం పై వస్తున్న విమర్శల గురించి మాట్లాడిన లోకేష్.. వైసీపీ కావాలనే కులాలు.. మతాల మధ్య గొడవలు సృష్టిస్తున్నారు అని మండిపడ్డారు. రానున్న రోజుల్లో ఇంకా ఇటువంటి డ్రామాలు చేస్తారని అన్నారు. విద్వేషాలు, గొడవలు సృష్టించాలని చూస్తారన్నారు. రెడ్ బుక్ కోసమే పోలీసులు పనిచేస్తున్నారు.. తప్పు లేదు కదా.. తప్పులు చేసిన వారికి ఇదే శిక్ష అన్నారు. తప్పు చేసిన వారి పేర్లు మాత్రమే రెడ్ బుక్ లో ఉంటాయని తేల్చి చెప్పారు. ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదు.. గేట్లకి తాళం వేయడం కాదన్నారు.