Friday, September 12, 2025 11:01 PM
Friday, September 12, 2025 11:01 PM
roots

ఆ సినిమా రీమేక్ చేస్తే.. ఎన్టీఆర్ ఒక్కడే బెస్ట్

దేవర సినిమాతో తాను ఏంటి అనేది ఇండియా వైడ్ గా ప్రూవ్ చేసుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు వార్ సిక్వెల్ తో పాటుగా ప్రశాంత్ నీల్ సినిమాతో కూడా బిజీగా ఉన్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ఎలాగైనా సరే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివతో సినిమా చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దేవర రెండో పార్ట్ వచ్చే అవకాశం ఉండవచ్చని ఈ మధ్య మళ్ళీ ప్రచారం జరుగుతోంది. అటు ఎన్టీఆర్ కూడా పార్ట్ 2 విషయంలో సానుకూలంగా ఉండటంతో డైరెక్టర్ కథను రెడీ చేస్తున్నాడు.

Also Read : రష్మిక దూకుడుకి బ్రేకులు పడ్డాయా..?

లేటెస్ట్ గా జపాన్లో దేవర 1 సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అక్కడి ప్రజలతో ఎన్టీఆర్, కొరటాల శివ మాట్లాడుతూ ఈ సినిమా గురించి అనేక విషయాలు బయట పెట్టారు. ఇక కొరటాల శివ, ఎన్టీఆర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు.. కళాతపస్వి కే విశ్వనాధ్.. భారతీయ సాంప్రదాయాలను గౌరవించేలా సినిమాలు చేశారని.. ఆయన రూపొందించిన క్లాసిక్ మూవీస్ లో సాగర సంగమం సినిమా ఒకటి అని.. కమల్ హాసన్ హీరోగా నటించిన సినిమా నేటి తరం దర్శకులు ఎవరైనా చేయాలి అనుకుంటే కచ్చితంగా కమల్ హాసన్ పాత్రలో ఎన్టీఆర్ మినహా ఎవరు సరిపోరు అంటూ కామెంట్ చేశారు.

Also Read : ముంబై సెన్సేషన్ అశ్వనీ కుమార్ బ్యాక్ గ్రౌండ్ ఇదే

జూనియర్ ఎన్టీఆర్ లో ఉన్న పొటెన్షియాలిటీ మాములుగా కాదని.. సాగర సంగమం వంటి శాస్త్రీయ నృత్య ప్రధానమైన చిత్రంలో చేసే సత్తా ఎన్టీఆర్ కే ఉన్నాయని కామెంట్ చేశాడు. ఖచ్చితంగా తనకు రీమేక్ చేసే అవకాశం వస్తే మాత్రం ఎన్టీఆర్ ను తీసుకుంటానన్నాడు కొరటాల శివ. కాగా దేవర 2.. 2026 లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి అనే ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి స్క్రిప్ట్ వరకు కూడా స్టార్ట్ చేశాడు కొరటాల శివ. ఎన్టీఆర్ బిజీగా ఉండటంతో సినిమా కాస్త ఆలస్యం అవుతుంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్