Friday, September 12, 2025 08:59 PM
Friday, September 12, 2025 08:59 PM
roots

జగన్ నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్..!

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మనస్థత్వం ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఆహా ఓహో అంటూ తనను పొగడ్తలతో ముంచెత్తిన వారినే నెత్తిన పెట్టుకుంటారు. అంతే తప్ప… చిన్న సలహా ఇచ్చినా.. లేక తన నిర్ణయాన్ని తప్పు అని ఎవరైనా చెప్పినా సరే… వారిని దూరం పెడతారు. అలాగే వారిపై కక్ష కూడా పెంచుకుంటారు. ఇక తన ప్రత్యర్థులను తిట్టిన వారికి పదవులు ఇచ్చే జగన్… ప్రత్యర్థులను ఏమీ అనని వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను దూషించిన కొడాలి నాని, రోజా, జోగి రమేష్ వంటి వారికి మంత్రి పదవులిచ్చారు. ఇక అలాగే జగన్‌ చుట్టూ కోటరీ చేరింది అంటూ అక్రమాస్తుల కేసులో ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డి చిన్న సలహా ఇస్తేనే… అగ్గిమీద గుగ్గిలం అయ్యారు జగన్. సాయిరెడ్డిని టార్గెట్ చేస్తూ రాజకీయాల్లో వ్యక్తిత్వం, విశ్వాసం ముఖ్యమన్నారు. అలాగే ప్రలోభాలకి లొంగకుండా భయపడకుండా ఉండాలంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పారు జగన్.

Also Read : చావులోనూ రాజకీయమే..!

ప్రస్తుతం పార్టీలో కీలక నేతపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారనేది విశ్వసనీయ సమాచారం. ఆయన ఎవరో కాదు… ఒంగోలు పార్లమెంట్ ఇంఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. జగన్‌కు అత్యంత ఆప్తుల్లో చెవిరెడ్డి ఒకరు. జగన్ సైన్యంలో ఒకరిగా చెవిరెడ్డికి గుర్తింపు. జగన్ చెప్పిన మాట చెవిరెడ్డి తూ చా తప్పకుండా పాటిస్తారని కూడా పార్టీలో చెప్పుకుంటారు. అయితే ఇటీవల ఓ విషయంలో మాత్రం జగన్‌కు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పట్టలేనంత కోపం వచ్చినట్లు తెలుస్తోంది. పిఠాపురంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో జగన్‌పై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తన ఆస్తులను కూడా జగన్ లాక్కున్నాడంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. అలాగే జగన్ తీరుపై కూడా బాలినేని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన జోలికి వస్తే.. మరిన్ని విషయాలు బయట పెడతా అంటూ బాలినేని మాస్ వార్నింగ్ ఇచ్చారు.

Also Read: అప్పుడైతే అలా.. మరి ఇప్పుడో..!

బాలినేని చేసిన వ్యాఖ్యలకు ప్రకాశం జిల్లా వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు మాత్రమే కౌంటర్ ఇచ్చారు. అంతే తప్ప వైసీపీ ముఖ్యనేతలు ఎవరూ మాట్లాడలేదు. చివరికి జిల్లాలో గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు తాటిపర్తి చంద్రశేఖర్, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కూడా నోరెత్తలేదు. అలాగే ఒంగోలు పార్లమెంట్ ఇంచార్జ్‌గా వ్యవహరిస్తున్న చెవిరెడ్డి కూడా కనీసం స్పందించలేదు. జగన్‌పై అంత పెద్ద ఆరోపణలు చేసిన బాలినేని శ్రీనివాసులు రెడ్డి గురించి కనీసం ఒక్క మాట కూడా ఎందుకు అనలేదనేది వైసీపీ నేతల ప్రశ్న. అధినేత గురించి అంత పెద్ద ఆరోపణలు చేస్తే… పార్టీ నేతలు సైలెంట్‌గా ఉంటారా అనేది తీవ్ర విమర్శలకు తావిస్తోంది. మరోవైపు వైసీపీలో ఎవరేం మాట్లాడాలన్నా కూడా… తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆర్డర్ రావాల్సిందే. పైగా వాళ్లు రాసించినట్లు మాత్రమే చదవాలి తప్ప… కొత్త పదాలు జోడించకూడదు. అలాంటిది జగన్‌పై బాలినేని ఆరోపణలు చేస్తే… ప్యాలెస్ ఇంచార్జ్ ఎందుకు నోరు మెదపలేదో అర్థం కావడం లేదు.

Also Read : పాస్టర్ ప్రవీణ్ కేసు.. ఏపీ పోలీసుల తీరుపై ప్రసంశలు

ఈ విషయంపై చెవిరెడ్డిపై జగన్ గుర్రుగా ఉన్నారనే మాట వినిపిస్తోంది. ఎందుకు ఇలా సైలెంట్‌గా ఉన్నావో చెప్పాలంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారట. జగన్ గురించి పూర్తిగా తెలిసి కూడా చెవిరెడ్డి ఇలా ఎందుకు మౌనంగా ఉన్నాడో అర్థం కావడం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జగన్ తీరు అందరికీ తెలిసిందే. ఆయనకు ఎదురు చెప్పినందుకే తల్లిని, చెల్లిని కూడా దూరం పెట్టారు. ఇచ్చింది తీసుకోవాలి.. చెప్పింది చేయాలి అనేది జగన్ తీరు. తేడా వస్తే.. సొంత బాబాయ్‌ని కూడా వదల్లేదు కదా అంటున్నారు సన్నిహితులు. జగన్ దగ్గర ఎవరికీ సుస్థిర స్థానం ఉండదనేందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి. అక్రమాస్తుల కేసులో కీలక నిందితుడు విజయసాయిరెడ్డి నే జగన్ వదల్లేదు… అలాంటిది చెవిరెడ్డిని వదులుతాడా అనేది… ఇప్పుడు పార్టీలో వినిపిస్తున్న మాట.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్