Friday, September 12, 2025 10:37 PM
Friday, September 12, 2025 10:37 PM
roots

డైరెక్టర్ గా మారుతున్న స్టార్ హీరో

బాలీవుడ్ స్టార్ హీరో .. డైరెక్టర్ గా మారబోతున్నాడు. స్టార్ హీరోగా వరుస సినిమాలు చేస్తున్న హృతిక్ రోషన్ ఇప్పుడు తన సినిమాను తానే డైరెక్ట్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. ‘క్రిష్ 4’ కోసం హృతిక్ రోషన్ రెడీ అవుతున్నాడు. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. రాకేష్ రోషన్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని రాకేశ్ రోషన్ ఎక్స్ లో అఫీషియల్ గా పోస్ట్ చేసాడు.

Also Read : ‘పెద్ది’ లుక్ పై సోషల్ మీడియాలో రచ్చ

25 సంవత్సరాల తర్వాత తన కొడుకుకు తన బాధ్యతను అప్పగిస్తున్నానని.. డైరెక్టర్ గా అతడ్ని తిరిగి లాంచ్ చేస్తున్నా అంటూ పోస్ట్ చేసారు. దుగ్గు.. 25 సంవత్సరాల క్రితం నేను నిన్ను నటుడిగా పరిచయం చేసాను. ఈ రోజు మళ్ళీ 25 ఏళ్ళ తర్వాత ఇద్దరు చిత్రనిర్మాతలు ఆది చోప్రా, నేను మన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం క్రిష్ 4 ను ముందుకు తీసుకెళ్లడానికి మిమ్మల్ని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం అని ప్రకటించాడు. శుభాకాంక్షలు చెప్తున్నానని.. ఈ సినిమా నీకు మంచి విజయాన్ని ఇవ్వాలని కోరుతున్నా అంటూ పోస్ట్ చేసాడు.

Also Read : భారత్ పై మయన్మార్ భూకంప ప్రభావం

ప్రస్తుతం హ్రితిక్ రోషన్.. వార్ 2 లో నటిస్తున్నాడు. ఈ సినిమా ఆగస్ట్ 15 కు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే పలు కారణాలతో అది వాయిదా పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఇటీవల సాంగ్ ప్రాక్టీస్ సందర్భంగా ఈ స్టార్ హీరో కాలికి గాయం అయింది. ఎన్టీఆర్, శ్రద్దా కపూర్ తో కలిసి హ్రితిక్ రోషన్.. ఐటెం సాంగ్ చేయాల్సి ఉంది. కాలికి గాయం కారణంగా షూటింగ్ వాయిదా వేసారు. ఇప్పటికే ఎన్టీఆర్ పోర్షన్ ఆల్మోస్ట్ కంప్లీట్ కాగా ఎన్టీఆర్ తో సాంగ్ మాత్రమే పెండింగ్ లో ఉంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్