Saturday, September 13, 2025 01:21 AM
Saturday, September 13, 2025 01:21 AM
roots

ఏపీ పోలీసుల కొత్త అవినీతి.. వైసీపీ అండదండలతో

అవినీతికి ఏదీ కాదు అనర్హం అన్నట్టు మారింది వైసీపీ పాలనలో పరిస్థితి. 2019 నుంచి 2024 వరకు అవకాశం ఉన్న ప్రతి చోట వైసీపీ నాయకులు అవినీతికి పాల్పడ్డారు. ఇక వైసిపి నాయకులతో పాటుగా అధికారులు కూడా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. కొంత మంది వైసీపీకి సహకరించే అధికారులు ప్రభుత్వ సొమ్మును దోపిడీ చేశారనే ఆరోపణలు అప్పట్లో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున చేశాయి. ముఖ్యంగా పోలీస్ అధికారులు సివిల్ తగాదాల్లో తల దూర్చడంతో పాటుగా భూ కబ్జా వ్యవహారాలను దగ్గర నుండి నడిపించారనే ఆరోపణలు కూడా అప్పట్లో వచ్చాయి.

Also Read : కాకాని పై గురి.. గవర్నర్ అనుమతి ఇస్తారా..?

తాజాగా రెండు, మూడు ఆరోపణలు జనాలను విస్మయానికి గురిచేస్తున్నాయి. పోలీసు జాగిలాలకు పెట్టే ఆహారంతో పాటుగా వాటిని తరలించే వాహనాల పెట్రోల్ విషయంలో కూడా అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. దాదాపు 4200 కిలోమీటర్లు ప్రయాణం చేయకపోయినా సరే దానికి సంబంధించి బిల్లులు పెట్టి సొమ్ములు చేసుకున్నారని వెల్లడించారు. ఇక తాజాగా లాప్ టాప్ లు, కంప్యూటర్లు, ప్రింటర్ల వ్యవహారంలో కూడా అవినీతి గుర్తించారు. పోలీస్ అధికారులకు ఇచ్చే లాప్ టాప్ లు కంప్యూటర్లు ప్రింటర్లలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపణలు వినపడుతున్నాయి.

Also Read : రజనీకి మరిది తలనొప్పి.. మరో కేసు రెడీ

కింది స్థాయి పోలీసులకు ఇచ్చే కొన్ని కంప్యూటర్లకు సంబంధించి పాత కంప్యూటర్లను కొని కొత్త వాటిగా బిల్లులు పెట్టారని.. అలాగే నాసిరకం కంప్యూటర్లను కొని.. భారీగా బిల్లులు చేయించుకున్నట్టు తెలుస్తోంది. కంప్యూటర్ సెంటర్లతో ఒప్పందం చేసుకుని కొన్ని తయారు చేయించారని గుర్తించినట్టు తెలుస్తోంది. అదే విధంగా టిడిపి నాయకులు, కార్యకర్తలు వద్ద దాడులు చేసిన సమయంలో వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న కంప్యూటర్లను, కొన్ని ప్రింటర్లను కెమెరాలను.. పోలీసు అధికారులకు ఇచ్చి వాటితో కూడా బిల్లులు చేసుకున్నారని గుర్తించారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్